
Manchu Vishnu – Manoj : మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతుండగా, సంఘటన అనంతరం మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనోజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పెద్ద దుమారం రేపింది. అన్నయ్య విష్ణు మీద ఆరోపణలు చేస్తూ… ఆయన గొడవ పడుతున్న వీడియో ఫేస్ బుక్ స్టేటస్ లో మనోజ్ పోస్ట్ చేశారు. విష్ణు నా వాళ్ళ మీద దాడులు చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. పోస్ట్ చేసిన వీడియో మనోజ్ వెంటనే డిలీట్ చేశారు. అయితే అప్పటికే అది వైరల్ గా మారింది.
ఈ వివాదం మీద విష్ణు మాట్లాడారు. ఇది చాలా చిన్న విషయం. మనోజ్ వయసులో చిన్నవాడు. ఆవేశంలో వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సారధి అనే వ్యక్తిని మనోజ్ వెనకేసుకొచ్చాడు, అందుకే చిన్న గొడవ… అన్నట్లు చెప్పారు. అన్నదమ్ముల గొడవ మీద అక్క మంచు లక్ష్మి కూడా మాట్లాడటం జరిగింది. ప్రతి ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. బ్రదర్స్ మధ్య ఏర్పడిన చిన్న డిస్ట్రబెన్స్ గా దీన్ని చూడాలి. విషయం తెలియకుండా కొందరు లేనిపోనివి రాస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన అనంతరం మొదటిసారి మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. ఓ మూవీ లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న మనోజ్ ని మీడియా చుట్టుముట్టింది. మీరు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో నేపథ్యం ఏంటి? విష్ణుతో గొడవేంటి? అని అడిగారు. ఈ ప్రశ్నలకు ఇబ్బంది పడ్డ మనోజ్ సమాధానం దాటవేశారు. నాకంటే టీవీ 9 వాళ్లకు బాగా తెలుసంటూ నవ్వేశారు. విష్ణు వివాదం మీద స్పందించకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు.
త్వరలో కొత్త మూవీ ప్రకటన చేయబోతున్నాను.ఆల్రెడీ ప్రకటించిన ‘వాట్ ది ఫిష్’ కూడా మొదలుకాబోతుంది. నాకు తెలిసింది సినిమానే. అదే నా జీవితం. అందుకే మరలా పరిశ్రమకు వచ్చాను. కొత్త జీవితం స్టార్ట్ చేశాను. మీరందరూ ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను… అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇప్పటికే మనోజ్ రచ్చ రచ్చ చేయగా, మరోసారి ఎలాంటి కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు. ఇక మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు ఆస్తుల పంపకాలే ప్రధాన కారణమన్న మాట వినిపిస్తోంది.