Manoj Manchu
Manoj Manchu: గత కొంతకాలం నుండి మంచు కుటుంబం లో జరుగుతున్న గొడవలను మనమంతా చూస్తూనే ఉన్నాం. మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు విష్ణు(Manchu Vishnu) లపై మంచు మనోజ్(Manchu Manoj) అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ లో తనకు వాటాలు ఇవ్వమంటూ మనోజ్ డిమాండ్ చేసినప్పటి నుండి ఈ గొడవలు మొదలు అయ్యాయి. మోహన్ బాబు కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ మంచు విష్ణు కే ఇచ్చారని, మనోజ్ కి తీరని అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మనోజ్ భూమా మౌనిక ని పెళ్లి చేసుకున్నప్పటి నుండే ఈ గొడవలు మొదలయ్యాయి. మౌనిక ని పెళ్లి చేసుకోవడం అటు మోహన్ బాబు కి కానీ , ఇటు విష్ణు కి కానీ ఇష్టం లేదు. అందుకే అప్పటి నుండి మనస్పర్థలు ఏర్పడి కుటుంబం రోడ్డు మీద నిలబడి కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఇప్పటికీ మనోజ్, మోహన్ బాబు వివాదం పై కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఇది ఇలా ఉండగా నేడు మోహన్ బాబు పుట్టినరోజు. నేటితో ఆయన 73 వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మనోజ్ తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో తన తండ్రి మోహన్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. ఈ సందర్భంగా ఆయన ‘యానిమల్’ చిత్రంలోని ‘నా సూర్యుడివే..నా చంద్రుడివే’ పాటతో మోహన్ బాబు పాత సినిమా వీడియో సాంగ్ కి అటాచ్ చేసి అప్లోడ్ చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హ్యాపీ బర్త్ డే నాన్న..ఈరోజు నేను నీ పక్కన ఉంటూ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం మిస్ అవుతున్నాను. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా నీతో కలిసి ఉండే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆయన ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.
ఈ పోస్ట్ కి మంచు లక్ష్మి లైక్ కొట్టింది. గొడవలు జరుగుతున్న సమయంలో కూడా మనోజ్ తన తండ్రి గురించి ఎక్కడా చెడుగా మాట్లాడలేదు. నా తండ్రి దేవుడితో సమానం అండీ, ఆయన మంచి తనాన్ని అడ్డు పెట్టుకొని మా అన్నయ్య విష్ణు నాటకాలు ఆడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే చాలా కాలం తర్వాత మనోజ్ ‘భైరవం’ అనే చిత్రం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర పోషించాడు. శంకర్ కూతురు అదితి శంకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రాన్ని కన్నప్ప విడుదలయ్యే ఏప్రిల్ 25 వ తేదీనే విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నారు.