Posani Krishna Murali Bail Petition
Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్ట్ అయ్యి నేటితో 21 రోజులు పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ని అరెస్ట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం గుంటూరు పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు. ఈ నెల 26 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. ఇదంతా పక్కన పెడితే తనకు బెయిల్ మంజూరు చేయాలనీ పోసాని CID కోర్టులో పిటీషన్ వేయగా, నేడు విచారణ జరిగింది. వాదనలు ముగిసిన తర్వాత తుది తీర్పు ని ఈ నెల 21 వ తేదికి వాయిదా వేసింది. ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
Also Read : సిఐడి కస్టడీకి పోసాని.. సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదన
గతంలో ఆయన ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తూ, వాళ్లకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలను కూడా ప్రదర్శించాడు. అందుకే ఆయన పై కేసు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా వారం రోజుల క్రితం ఆయన గుంటూరు జడ్జి ముందు తనకు బెయిల్ ఇవ్వకపోతే అఘాయిత్యం చేసుకుంటానని బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జడ్జి తన డ్యూటీ తానూ చేసుకుంటూ ముందుకు పోయాడు. ఈ రిమాండ్ నుండి ఆయన బయటకు వచ్చినా, మరో కేసు లో అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. రీసెంట్ గానే ఒక వ్యక్తి పోసాని తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 9 లక్షలు తీసుకొని మోసం చేసాడని మీడియా ముందుకొచ్చి ఆరోపించాడు. ఆయన ఆంధ్ర లో ఎక్కడైనా కేసు నమోదు చేస్తే పోసానిని అరెస్ట్ చేస్తే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈసారి ఆయన ఎలాంటి బెదిరింపులు చేస్తాడో అని ఆలోచిస్తున్నారు నెటిజెన్స్.
అయితే పోసాని ని ఇన్ని పోలీస్ స్టేషన్స్ తిప్పుతున్నా కూడా ఎవరికీ ఆయనపై జాలి కలగకపోవడం గమనార్హం. గతంలో ఆయన చేసిన కామెంట్స్ ని ఒక్కసారి యూట్యూబ్ లో చూస్తే ఎలాంటి వారికైనా కోపం రాక తప్పదు. జీవితం లో మనం ఎప్పుడూ కూడా అంత నీచమైన మాటలను విని ఉండము. చిన్న పిల్లలను కూడా వదలకుండా శాపనార్థాలు పెట్టాడు ఆయన. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందో, మూడు నెలల తర్వాత రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చాడు. అప్పటికే అతనికి సీన్ మొత్తం అర్థమైపోయింది. త్వరలో తనని అరెస్ట్ చేయబోతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకున్న పోసాని, కనీసం రాజకీయాలకు దూరం గా ఉంటే తన జోలికి ఎవ్వరూ రారు అనుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం వదలలేదు.
Also Read : తెల్లటి జుట్టు, గెడ్డం.. వల్లభనేని వంశీ అలా మారిపోయారేంటి?