https://oktelugu.com/

మంచు వారబ్బాయికి మంచి కథ దొరికినట్టుంది

సీనియర్ హీరో విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడు. 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు’ డిజాస్టర్ అయ్యాక. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ తీసుకున్నాడు. కొత్త సినిమాను ఖరారు చేసే విషయంలో చాలా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రం తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి అయిదవ తారీకునాడు రామ్ చరణ్ […]

Written By: , Updated On : March 10, 2020 / 03:20 PM IST
Follow us on

సీనియర్ హీరో విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడు. 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు’ డిజాస్టర్ అయ్యాక. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ తీసుకున్నాడు. కొత్త సినిమాను ఖరారు చేసే విషయంలో చాలా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రం తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి అయిదవ తారీకునాడు రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్, విలన్ ఖరారయ్యారు. ఈ చిత్రాన్ని మంచు మనోజ్ పాన్ ఇండియా లెవెల్లో తీయాలను కొంటున్నాడు.. అందుకే హీరోయిన్, విలన్లను వేరే భాష నుంచి తీసుకొచ్చాడు..

తమిళంలో పాపులర్ అయిన ప్రియ భవానీ శంకర్ ఈ చిత్రానికి కథానాయికగా ఎన్నిక అయింది. ఈమె కార్తీ నటించిన ‘చినబాబు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.. తమిళంలో మన దర్శకుడు ఏ .కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ హీరోగా వచ్చిన ‘మెయ్యాదమాన్’ చిత్రం తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకొంది..

ఇక విలన్ గా నట దర్శకుడు సముద్రఖని చేయబోతున్నాడు. రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ఈయన తెలుగు వారికి బాగానే సుపరిచుతు డయ్యాడు.. పాన్ ఇండియా మూవీ అంటున్నారు కాబట్టి ఇతర ముఖ్య పాత్రలకు హిందీ, కన్నడ, మలయాళ నటుల్ని కూడా మంచు మనోజ్ తీసుకొనే ఛాన్స్ ఉంది.
It is need of the hour