Fish Venkat health update: గత కొద్దిరోజుల నుండి ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా లో మనం వింటూనే ఉన్నాం. చాలా కాలం నుండి అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్, ఇప్పుడు పూర్తిగా అస్వస్థత పాలవ్వడం, ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడం తో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్లు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ని మెరుగు పరిచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ, ఫలితం లేకుండా పోయింది. కిడ్నీ దాతలు దొరికితే సర్జరీ కి అవసరం అయ్యే డబ్బులు ఇవ్వడానికి సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖులందరూ రెడీ గానే ఉన్నారు. కానీ కిడ్నీ దాతలు కరువు అయ్యారు. అయితే మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్ కి రీసెంట్ గానే ఫిష్ వెంకట్ ని తరలించారు.
Also Read: ఓజీ తో రికార్డ్స్ అన్నింటిని దుల్ల కొడుతున్నాం..ఎవడొస్తాడో రండి చూసుకుందాం : డైరెక్టర్ సుజిత్
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందట. రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయ్యినట్టు సమాచారం. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే ఫిష్ వెంకట్ స్పృహలో లేడు. గత మూడు రోజులుగా ఆయన కళ్ళు కూడా తెరవడం లేదట. ఆయన పరిస్థితి ని చూసి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ లో చేర్చిన కొత్తల్లో స్పృహలోనే ఉండేవాడు కానీ, మాట్లాడేవాడు కాదనీ, సైగలతోనే తనకు అవసరం అయ్యే పనులు చేయించుకునేవాడని, కానీ ఇప్పుడు మాత్రం అసలు స్పృహలోకి రావడం లేదంటూ రీసెంట్ గానే ఫిష్ వెంకట్ సతీమణి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్యం లో ఎలాంటి మార్పు లేకపోగా,రోజు రోజుకి తీవ్రంగా విషమించడం ఆయన్ని అభిమానించే వారికి తీవ్రమైన బాధ కలుగుతుంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఆయన కోలుకుంటాడో లేదో చూడాలి.
Also Read: పూజ హెగ్డే డ్యాన్స్ కి ఈలలు వేసి చిందులు వేసిన త్రివిక్రమ్.. సంచలనం రేపుతున్న వీడియో!
ఇక ఫిష్ వెంకట్ కెరీర్ విషయానికి వస్తే, ఈయన పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ సినిమాలో ఈయన క్యారక్టర్ బాగా వైరల్ అవ్వడంతో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తన ప్రతీ సినిమాలో ఫిష్ వెంకట్ కి ఒక క్యారక్టర్ రాసేవాడు. అలా రౌడీ గ్యాంగ్ లో ఒకడిగా ప్రతీ సినిమాలో కనిపించే ఫిష్ వెంకట్ తో డైరెక్టర్స్ కామెడీ కూడా చేయించుకునేవారు. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రం లోని అంత్యాక్షరి సన్నివేశం లో ఫిష్ వెంకట్ కామెడీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో ఇదే రేంజ్ కామెడీ క్యారెక్టర్స్ ని ఆయనతో చేయించేవారు మేకర్స్. ఏడాది కి కనీసం పది సినిమాలు చేసే ఫిష్ వెంకట్, ఆరోగ్యం బాగా ఉండుంటే ఇప్పటికీ అదే రేంజ్ డిమాండ్ తో సినిమాలు చేసేవాడు.