OG movie Sujeeth: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఈ చిత్రం మొత్తం మీద 400 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే సాధారణమైన విషయం కాదు. సాధారణంగా ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక స్టార్ హీరోకి జరగాలంటే కాంబినేషన్స్ కావాలి. కానీ ‘ఓజీ’ చిత్రానికి కేవలం పవన్ కళ్యాణ్ పేరు తప్ప, మరొకటి లేదు. డైరెక్టర్ సుజిత్ కి కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది, అందులో ఒక సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
Also Read: 3 రోజుల్లో 1 లక్ష డాలర్లు..నార్త్ అమెరికాలో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాల్లో క్లోజ్ అయ్యింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 180 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ఈ చిత్రం. అందులో సీడెడ్ 23 కోట్లు,ఉత్తరాంధ్ర 24 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 14 కోట్ల 60 లక్షలు, నైజాం 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రాల లిస్ట్ తీస్తే, #RRR, పుష్ప 2, కల్కి 2898 AD, సలార్ లకు మాత్రమే జరిగింది. ఇవన్నీ వేరే లెవెల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. వీటి బిసినెస్ జరిగే సమయానికి ప్రమోషనల్ కంటెంట్ బోలెడంత బయటకు వచ్చింది. కానీ ఓజీ చిత్రానికి ఇప్పటి వరకు గ్లింప్స్ వీడియో తప్ప మరొకటి రాలేదు.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ గా రష్మిక..? ఆమె లుక్ ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ రావడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమయ్యే మ్యాజిక్స్ అని అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఓజీ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ని క్రియేట్ చేశారు. ఇందులో సుజిత్(Director Sujeeth) ‘ఈసారి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టబోతున్నాం..ఎవడొస్తాడో రండి రా చూసుకుందాం’ అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియో ని ఓజీ అప్డేట్ వచ్చిన ప్రతీ సారీ అప్లోడ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రం వాయిదా పడింది అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 న విడుదల చేస్తున్నారని మేకర్స్ మరోసారి ఖరారు చేశారు.