https://oktelugu.com/

Manisha Koirala : ఇద్దరికీ అందుకే విడాకులు ఇచ్చిందట.. సీక్రెట్స్ అన్ని బయటపెట్టిన హీరోయిన్

సినిమాల్లో కొనసాగుతున్న సమయంలో మనీషా కోయిరాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. వివిధ హీరోలతో ప్రేమాయణం సాగిస్తున్నారని, వారినే పెళ్లి చేసుకుంటుందని అన్నారు. కానీ ఆమె చివరికి నేపాల్ కు చెందిన వ్యాపావేత్త మేన్ సామ్రాట్ దహల్ అనే వ్యక్తిని 2010లో పెళ్లి చేసుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2024 / 03:13 PM IST

    manisha koirala

    Follow us on

    Manisha Koirala : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మనీషా కోయిరాలా ఒకరు. ఎవరైనా ఆడవారిని అందంతో పొగిడేటప్పుడు ముందు ఐశ్వర్యరాయ్, ఆ తరువాత మనీషా కోయిరాలా గురించి చెప్పేవారు. అంతటి అందమైన భామగా గుర్తింపు పొందిన ఆమె తెలుగు, తమిళం, మలమాళంతో పాటు హిందీ సినిమాల్లో నటించి స్టార్ నటిగా కొనసాగింది. అయితే సినిమాల్లో ఎన్నో బంపర్ హిట్ల సినిమాల్లో నటించిన మనీషా కోయిరాలా.. రియల్ లైఫ్ లో మాత్రం విషాద సంఘటనలను ఎదుర్కొంది. ముఖ్యంగా తాను పెళ్లి చేసుకున్న భర్తను శత్రువు అంటూ చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    మనీషా కోయిరాలు నేపాల్ లో 1970 ఆగస్టు 16న జన్మించారు. ఈమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే 1989లో ‘ఫేరి భేతైలా’ అనే నేపాలి సినిమాలో నటించింది. అయితే మనీషాకు చిన్నప్పుడు డాక్టర్ కావాలన్న కోరిక ఉండేది. కానీ 1991 ‘సైదాగర్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1942లో ‘ఎ లవ్ స్టోరీ’, 1994లో తమిళ చిత్రం ‘బాంబే’ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించింది. ఆ తరువాత తెలుగులో క్రిమినల్ అనే సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది.

    సినిమాల్లో కొనసాగుతున్న సమయంలో మనీషా కోయిరాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. వివిధ హీరోలతో ప్రేమాయణం సాగిస్తున్నారని, వారినే పెళ్లి చేసుకుంటుందని అన్నారు. కానీ ఆమె చివరికి నేపాల్ కు చెందిన వ్యాపావేత్త మేన్ సామ్రాట్ దహల్ అనే వ్యక్తిని 2010లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం బాగానే సాగినా.. ఆరు నెలల తరువాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు.

    అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలు భర్త గురించి సంచలన విషయాన్ని చెప్పింది. ఒకప్పుడు తన భర్తే తనకు పెద్ద శత్రువు అని.. నా భర్తపై ఎప్పుడూ ప్రేమలేదు.. ఒక స్త్రీకి ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది.. అని మనీషా అన్నాడు. అయితే మనీషా కోయిరాలు ఇలా చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమాల్లో ఎంతో అలరించిన ఈ భామ పర్సనల్ లైఫ్ విషాదంగా మారి ఒంటరిగానే ఉంటోంది.