Dallas: అమెరికాలో బందరోళ్ల సందడి.. ఏం చేయబోతున్నారో తెలుసా?

ఒకవైపు అధ్యక్ష ఎన్నికల సందడి, మరోవైపు ఆటా 18వ కాన్ఫరెన్స్‌ సందడి కొనసాగుతుండగా, ఇప్పుడు బందరోళ్ల సందడి మొదలైంది. బందరులో పుట్టి, పెరిగి చదువుకుని అమెరికాలో స్థిరపడిన వారంతా ఒకచోట కలవాలని నిర్ణయించుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 17, 2024 2:40 pm

Dallas

Follow us on

Dallas: అగ్రరాజ్యాం అమెరికాలో ఒకవైపు ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్స్‌ పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్స్‌ పార్టీ తరఫున జోబైడెన్‌ బరిలో దిగబోతున్నారు. ఇద్దరూ వృద్ధులే కావడంతో అమెరికాలో ఇద్దరి పోటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాలు ఈ ఏడాది తెలుగోళ్లు సందడి చేస్తున్నారు. జూన్‌లో నిర్వహించే 18వ ఆటా కాన్ఫరెన్స్‌ కోసం నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్‌ 7 నుంచి 9 వరకు 18వ కన్వెన్షన్‌ అండ్‌ యూత్‌ కాన్ఫరెన్ల్‌ అందరూ పాల్గొనాలని కోరుతున్నారు.

తాజాగా బందరోళ్ల సందడి..
ఇదిలా ఉండగా ఒకవైపు అధ్యక్ష ఎన్నికల సందడి, మరోవైపు ఆటా 18వ కాన్ఫరెన్స్‌ సందడి కొనసాగుతుండగా, ఇప్పుడు బందరోళ్ల సందడి మొదలైంది. బందరులో పుట్టి, పెరిగి చదువుకుని అమెరికాలో స్థిరపడిన వారంతా ఒకచోట కలవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు డల్లాస్‌లో ఏప్రిల్‌లో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈమేరకు అందరికీ ఆహ్వానం పంపుతున్నారు.

గతంలో అమెరికాలో..
గతంలో ఈ కార్యక్రమం ఏటా హైదరాబాద్‌లో నిర్వహించేవారు. 24 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం జనవరి 26న నిర్వహిస్తున్నారు. ఈసారి తొలిసారిగా 2024లో ఏప్రిల్‌ 28న బందరోళ్ల సందడి పేరుతో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక నిర్వహించనున్నారు. అమెరికాలో స్థిరపడిన మీరు, మీ చిన్ననాటి మిత్రులు కలిసే అపూర్వ అవకాశం ఇది. మీరు తప్పకుండా రండి. మన బందరు పూర్వ విద్యార్థులందరికీ ఈ విషయం తెలియజేయండి. బందరులో ఏ సంవత్సరం చదివనినా పర్వాలేదు. అందరం కలవాలన్నదే ఈ కర్యాక్రమం ఉద్దేశం అని ముద్రించిన ఇన్విటేషన్‌ను బందరు వారికి పంపుతున్నారు.

ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు..
ఇక బందరోళ్ల సందడి కోసం ఓ వాట్సాప్‌ గ్రూపు కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలో బందరలోళ్లు ఎక్కడున్నా వాట్సాప్‌ గ్రూపులో చేరేలా సమాచారం ఇస్తున్నారు. ఈమేరకు ఇన్విటేషన్‌తోపాటు వాట్సాప్‌ గ్రూపు లింక్‌ పంపిస్తున్నారు. (http://whatsapp.com/channel/2024) లింక్‌ ద్వారా బందరోళ్ల వాట్సాప్‌ గ్రూపులో జాయిన్‌ కావొచ్చు.