Bigg Boss Telugu 8: ఈ సీజన్ ప్రారంభం నుండి, గత వారం వరకు మణికంఠ హౌస్ లో ఉండాలి, ఎలా అయినా గేమ్ గెలవాలి, అనే పట్టుదలతో ఉండేవాడు. ఈ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్తే, తన జీవితం ఏమిటో కూడా అర్థం కాదని, అసలు బిగ్ బాస్ లేకపోతే తనకి జీవితమే లేదని చెప్పుకొచ్చేవాడు. కానీ ఈ వారంలో ఇతనిలో షేడ్స్ చూసిన తర్వాత హౌస్ లో ఉండే ఇతని స్నేహితులు కూడా మణికంఠ ప్రవర్తనని నమ్మలేకపోయాను. ఈ వారం ప్రారంభం లో విష్ణు ప్రియ, నయనీ పావని మరియు హరితేజ వంటి వారితో నాకు హౌస్ లో ఉండాలని అనిపించడం లేదు, ఎలిమినేట్ అవ్వాలని ఉంది అని చెప్పుకొచ్చాడట. కానీ టాస్కులు ఆడేటప్పుడు ఈయన చేసిన డబుల్ స్టాండర్డ్స్ కి వాళ్లకు మతి పోయింది. హరితేజ తో మంచిగా ఉంటూ, నాకు ఈ టాస్క్ లో కొనసాగాలని ఉంది, దయచేసి సపోర్ట్ చేయమని అడిగాడు.
అలాగే గౌతమ్ వద్దకు కూడా వెళ్లి ‘నేను బోన్ పట్టుకున్నప్పుడు నిన్ను ఎలిమినేట్ చేయను, నువ్వు బోన్ బోన్ పట్టుకున్నప్పుడు నన్ను ఎలిమినేట్ చేయకు’ అని డీల్ పెట్టుకున్నాడట. ఆ డీల్ లో భాగంగా మణికంఠ చేతిలోకి బోన్ వచ్చినప్పుడు హరితేజ ని, టేస్టీ తేజ ని తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అంతే కాదు గౌతమ్ తో డీలింగ్ పెట్టుకున్నట్టు కూడా బహిరంగంగా చెప్పేసాడు. ఇది విన్న హరితేజ కి మైండ్ బ్లాక్ అయ్యింది. శుక్రవారం ఎపిసోడ్ లో హరితేజ మణికంఠ తో మాట్లాడుతూ ‘నిన్న మొన్నటి వరకు నాకు ఎలిమినేట్ అయిపోవాలని ఉంది అని నాకు చెప్పుకుంటూ వచ్చావు. నీ మనసులో నిజంగా అదే ఉంటే, కంటెండర్ అయ్యే ఆశ ఉండేది కాదు, నువ్వు నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావ్ కదా?’ అని అంటుంది.
దానికి మణికంఠ సమాధానం చెప్తూ ‘అవును..నేను అలా అన్నాను, నిజమే..కానీ నాకు ఓట్లు వేసే జనాల కోసం కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వాలి కదా , అందుకే ఆడాను’ అని అంటాడు. ఇది కాసేపు పక్కన పెడితే వారం ప్రారంభంలో మణికంఠ గంగవ్వ కి ఒక మాట ఇస్తాడు. ఈ వారం తాను నామినేషన్స్ నుండి సేవ్ అయితే, నీకు తులం బంగారం బహుమతిగా ఇస్తాను, ఫ్యామిలీ వీక్ వరకు కొనసాగితే రెండు తులాల బంగారం ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఈ వారం తాను కచ్చితంగా వెళ్ళిపోతాను అనే నమ్మకంతోనే మాట ఇచ్చాడా?, లేకపోతే తనకి హౌస్ లో నిజంగా ఉండాలి అనే కోరికతోనే ఇచ్చాడా అనేది ఆడియన్స్ కి అర్థం కాలేదు. మణికంఠ అంటే ఆడియన్స్ కి కానీ, లోపల ఉండే హౌస్ మేట్స్ కి కానీ, అతని ప్రవర్తన కారణంగా నిమిషానికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎక్కువ శాతం మంది జనాలు మణికంఠ చేసేది డ్రామాలు అనే అనుకుంటున్నారు.