Bigg Boss Telugu 8: హౌస్ మేట్స్ నిర్ణయం వల్లే మణికంఠ ఎలిమినేట్ అయ్యాడా..? రేపటి ఎపిసోడ్ లో జరగబోయేది ఇదే!

సోషల్ మీడియా లో విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మణికంఠ అనేక సార్లు కెమెరాల ముందుకు వచ్చి నా ఆరోగ్యం సహరాయించడం లేదని, నన్ను బయటకి పంపేయండి అంటూ చెప్పుకున్నాడట. కనీసం ఫ్యామిలీ వీక్ వరకు అయినా ఉండాలని కోరుకున్నానని, కానీ తన వల్ల అవ్వడం లేదని, ఎక్కడ టాస్కులు ఆడే సమయంలో గుండె ఆగి చనిపోతానేమో అనే భయం ఉందని, మణికంఠ చెప్పుకొచ్చాడు అంట.

Written By: Vicky, Updated On : October 20, 2024 8:59 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లోనే షాక్ కి గురి చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే, అది నాగ మణికంఠ ఎలిమినేషన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా లో ఏ పోల్ చూసిన నాగమణికంఠ కి మంచి ఓటింగ్ వచ్చింది కదా, కొన్ని చోట్ల 5వ స్థానం లో ఉన్నాడు, కొన్ని చోట్ల మూడవ స్థానంలో ఉన్నాడు, అయినప్పటికీ ఈయన ఎలిమినేట్ ఎలా అయ్యాడు?, కచ్చితంగా టేస్టీ తేజ, పృథ్వీ కంటే తక్కువ ఓట్లు ఇతనికి రాలేదు, బిగ్ బాస్ యాజమాన్యం ఇతన్ని కావాలని హౌస్ నుండి తప్పించింది అంటూ సోషల్ మీడియా లో మణికంఠ అభిమానులు అనుకుంటున్నారు. అంతే కాలేదు, ఆయన్ని ద్వేషించేవాళ్ళు కూడా తక్కువ ఓట్లు పడ్డాయి అంటే ఒప్పుకోవడం లేదు.

అయితే మణికంఠ ని ఓట్లు ఆధారంగా ఎలిమినేట్ చేయలేదని, తన అంతటా తానే ఎలిమినేట్ అయ్యాడని, సోషల్ మీడియా లో విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మణికంఠ అనేక సార్లు కెమెరాల ముందుకు వచ్చి నా ఆరోగ్యం సహరాయించడం లేదని, నన్ను బయటకి పంపేయండి అంటూ చెప్పుకున్నాడట. కనీసం ఫ్యామిలీ వీక్ వరకు అయినా ఉండాలని కోరుకున్నానని, కానీ తన వల్ల అవ్వడం లేదని, ఎక్కడ టాస్కులు ఆడే సమయంలో గుండె ఆగి చనిపోతానేమో అనే భయం ఉందని, మణికంఠ చెప్పుకొచ్చాడు అంట. ఈ వీడియోస్ ని హౌస్ మేట్స్ కి చూపించి, మణికంఠ హౌస్ లో ఉండాలా వద్దా అని అడుగుతాడట. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ పరిస్థితి ని అర్థం చేసుకొని, మెహబూబ్, నభీల్, నయనీ పావని మినహా అందరూ వెళ్లిపోవాలని కోరుకున్నారట. దీంతో హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, మణికంఠ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని, నాగార్జున అతన్ని ఎలిమినేట్ చేసినట్టు చెప్తున్నారు. నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారట. నేడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మణికంఠ ఇన్ని రోజులు చేసింది డ్రామానా?, లేకపోతే అతని మనస్తత్వం నిజంగా అదేనా అనేది నేటి ఎపిసోడ్ తో తేలనుంది. ఎందుకంటే మణికంఠ ని ఇష్టపడేవాళ్లు ఎంతమంది ఉన్నారో, అతన్ని ద్వేషించే వాళ్ళు అంతకు పది రెట్లు ఉన్నారు.

కేవలం సీరియల్స్ చూసేవాళ్ళు తప్ప, మణికంఠ సానుభూతి కి ఎవ్వరూ కనెక్ట్ అవ్వలేదు. ప్రతీ ఒక్కరు అతను డ్రామా చేస్తున్నాడు అనే అనుకున్నారు. సోషల్ మీడియా లో ఉండే రివ్యూయర్స్, మాతో సహా, అందరూ ఆయన డ్రామాలు ఆడుతున్నాడు అనే విశేషణలు చేసారు. అయితే మేమంతా మణికంఠ ని తప్పుగా అపార్థం చేసుకున్నామా?, లేకపోతే మన అభిప్రాయం, మన విశ్లేషణలకు తగ్గుట్టు గానే మణికంఠ ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. నిన్న నాకు ఓటు వెయ్యకండి, నాకు వెళ్లిపోవాలని ఉంది అని కెమెరాలకు చెప్పగానే సగం మందికి మణికంఠ గురించి క్లారిటీ వచ్చేసింది, ఈరోజుటి ఎపిసోడ్ తో పూర్తి క్లారిటీ రానుంది.