Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్, ఆడియన్స్ గౌతమ్ కృష్ణ మీద భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే సీజన్ 7 లో ఈయన పులి లాగా ఆడాడు, మిగతా హౌస్ మేట్స్ మొత్తం గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని ఆడితే, గౌతమ్ కృష్ణ మాత్రం సోలో గా ఆడాడు. జీరో గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయన, లక్షలాది మంది అభిమానుల ప్రేమని సొంతం చేసుకొని 13 వారాలు హౌస్ లో ఉండి వెళ్ళాడు. అలాంటి కంటెస్టెంట్ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు కచ్చితంగా తారా స్థాయిలో ఉంటాయి. కానీ అంచనాలను గౌతమ్ మొదటి వారం లో అందుకోలేకపోయాడు. కానీ రెండవ వారంలో మాత్రం ఆయన వింటేజ్ గౌతమ్ ని బయటకి తీసాడు.
మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో ఒక్కడే ఏకంగా 11 మంది కంటెస్టెంట్స్ ని ఒంటి చేతితో ఓడించి మెగా చీఫ్ గా మారాడు. ఇది కదా ఆశలు సిసలు గౌతమ్ ఆట అని అందరూ సోషల్ మీడియా లో పోస్టులు వేశారు. అయితే ఇప్పుడు గౌతమ్ ఆట యష్మీ మాయలో పడి సైడ్ ట్రాక్ ఎక్కనుందా అంటే, ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పొచ్చు. నిన్నటి ఎపిసోడ్ లో చూపించిన శుక్రవారం కంటెంట్ లో యష్మీ కి గౌతమ్ ప్రపోజ్ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన యష్మీ తో మాట్లాడుతూ ‘నేను సింగల్..నా వయస్సు కేవలం 28 ఏళ్ళు మాత్రమే. నాకు కూడా జీవితం లో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా. కానీ అందరి లాగానే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. గేమ్ ని గేమ్ లాగా చూస్తాను, స్నేహాన్ని కానీ, ఇతర సంబంధాలను కానీ వేరుగా చూస్తాను. ఏదైనా నిజాయితీగా నాకు అనిపించిందే చేశాను తప్ప, వేరే ఉద్దేశ్యం లేదు. ఏదైనా రిలేషన్ డెవలప్ కావాలంటే కచ్చితంగా స్నేహం ఉండాలి. నాకు నిజంగా నీ మీద క్రష్ ఏర్పడింది. భవిష్యత్తులో అది ఎంత దూరం వెళ్తుంది అనేది హౌస్ లో పరిస్థితులను బట్టి తెలుస్తుంది. కానీ ఏదైనా ఇద్దరి వైపు ఉంటేనే బంధం నిలబడుతుంది. కానీ నాకు నువ్వు అందరిలో స్పెషల్ గా, నా కళ్ళకు క్యూట్ గా అనిపిస్తావు కాబట్టి, నేను నీతో కాస్త క్లోజ్ గా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘పర్వాలేదు నీకు ఎలా ఉండాలని అనిపిస్తే అలా ఉండు, నాకు ఏదైనా సందర్భంలో అసౌకర్యంగా అనిపిస్తే కచ్చితంగా నీకు చెప్తాను. నీ ఇష్టాన్ని నేను కాదు అనడానికి నేను ఎవరిని’ అని అంటుంది. కచ్చితంగా వీళ్ళ మధ్య మ్యాటర్ రాబోయే రోజుల్లో పరుగులు తీసేలా ఉంది, గొడవలు కూడా జరగవచ్చు, చూడాలి మరి.