https://oktelugu.com/

Mani Sharma: మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి… త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్…

Mani Sharma: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. తాజాగా ఆయన కుమారుడు స్వర సాగర్ మహతి నిశ్చితార్ధం సంజనా కలమంజేతో జరిగింది. కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక స్వర సాగర్ మహతి పెళ్లి చేసుకునే యువతి సంజనా కలమంజే కూడా గాయని కావడం విశేషం. స్వర సాగర్ మహతి, సంజనా కలమంజేల పెళ్లి ఈ నెల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 13, 2021 / 11:30 AM IST
    Follow us on

    Mani Sharma: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. తాజాగా ఆయన కుమారుడు స్వర సాగర్ మహతి నిశ్చితార్ధం సంజనా కలమంజేతో జరిగింది. కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక స్వర సాగర్ మహతి పెళ్లి చేసుకునే యువతి సంజనా కలమంజే కూడా గాయని కావడం విశేషం.

    స్వర సాగర్ మహతి, సంజనా కలమంజేల పెళ్లి ఈ నెల 24న చెన్నైలోని ‘ది అకార్డ్ ఫంక్షన్‌ హాల్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. సంజనా కలమంజే… మహతి స్వర సాగర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రంలో ‘హే చూశా’ గీతం ఆలపించింది.

    మణి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సంగీతంతో కొన్నాళ్లపాటు తెలుగువారిని అలరించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం ఓ రేంజ్‌లో ఉంటుంది. మణిశర్మ మొదటగా 1992‌లో వచ్చిన రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతాన్ని అందించారు. సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు మణిశర్మ.

    ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర శిష్యరికం చేసారు. డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్ హీరోస్’తో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారారు. మణిశర్మ చేసిన మెలొడీలలో చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అందుకే మణిశర్మను మెలోడీ బ్రహ్మ అని అంటారు. ఇక తండ్రి బాటలో తనయుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు.