https://oktelugu.com/

Hyper Aadi: మల్లెమాలకు షాక్?: బిగ్ బాస్ లోకి వచ్చిన హైపర్ ఆదికి షాకింగ్ రెమ్యూనరేషన్

Hyper Aadi: ఈటీవీలో జబర్ధస్త్ సహా రియాలిటీ షోలన్నింటిని నిర్వహించేది ‘మల్లెమాల ప్రొడక్షన్స్’. అందులో పాల్గొనే వాళ్లు ఇతర టీవీ, న్యూస్ చానెల్స్ లో చేయకూడదన్న నిబంధన ఉంటుందన్న టాక్ టీవీ ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా జబర్ధస్త్ కమెడియన్లు వదిలిపెట్టి పోవాలంటే రూ.10లక్షలు కట్టి పోవాలన్న నిబంధన ఉందట.. బిగ్ బాస్ లోకి వచ్చేందుకు కమెడియన్ ముక్కు అవినాష్ కూడా ఇలా కట్టే బయటకు వచ్చాడని టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడిచింది. అయితే జబర్ధస్త్ లోనే స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2021 / 10:19 AM IST
    Follow us on

    Hyper Aadi: ఈటీవీలో జబర్ధస్త్ సహా రియాలిటీ షోలన్నింటిని నిర్వహించేది ‘మల్లెమాల ప్రొడక్షన్స్’. అందులో పాల్గొనే వాళ్లు ఇతర టీవీ, న్యూస్ చానెల్స్ లో చేయకూడదన్న నిబంధన ఉంటుందన్న టాక్ టీవీ ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా జబర్ధస్త్ కమెడియన్లు వదిలిపెట్టి పోవాలంటే రూ.10లక్షలు కట్టి పోవాలన్న నిబంధన ఉందట.. బిగ్ బాస్ లోకి వచ్చేందుకు కమెడియన్ ముక్కు అవినాష్ కూడా ఇలా కట్టే బయటకు వచ్చాడని టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడిచింది.

    aadi shocking remuneration for bigg boss 5

    అయితే జబర్ధస్త్ లోనే స్టార్ కమెడియన్ హైపర్ ఆది విషయంలో మాత్రం అలాంటి కట్టుబాట్లు ఏమీ పెట్టలేదట.. ఎందుకంటే అతడు లేకపోతే ఆ కామెడీ షోనే నడవదన్న టాక్ ఉంది. వన్ మ్యాన్ ఆర్మీ హైపర్ ఆది మరీ.. అందుకే ఈటీవీ జబర్ధస్త్ లో చేస్తున్న కూడా బిగ్ బాస్ షోపై సందడి చేశాడు. తెరపైకి కామెడీ అద్భుతంగా పండించే హైపర్ ఆదిని తాజాగా బిగ్ బాస్ లోకి ‘ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్’ గా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ షో బాగా రక్తకట్టి..కామెడీ పూయించింది. మంచి రేటింగ్ వచ్చిందట.. హైపర్ ఆది వేసిన పంచులు బాగా పేలాయట..

    ‘బిగ్ బాస్ ’ ప్రారంభంలోనే ఈ షోను ఫాలో కావాలని.. ఒక షోకు రావాలని హైపర్ ఆదితో బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుందట.. ఈ దసరా సందర్భంగా ఆదిని రప్పించారు. అతడు దాదాపు అరగంట పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్లను కడిగిపారేశాడు. సమాయనుసారంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లపై అతడు వేసిన సెటైర్లు, వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.

    పోయిన సంవత్సరం కూడా హైపర్ ఆది వచ్చాడు. ఈసారి కూడా మరోసారి బిగ్ బాస్ లోకి హైపర్ ఆది వచ్చాడు. పక్కనే నాగార్జున ఉన్నా కూడా అతడిని కూడా హైపర్ ఆది డామినేట్ చేసేశాడు. స్క్రీన్ ఆది ఎంట్రీ ఇచ్చాక అసలు నాగార్జున ఒక్క మాట మాట్లాడలేదంటే అర్థం చేసుకోవచ్చు.

    బిగ్ బాస్ టీం మేట్స్ తప్పు ఒప్పులపై కడిగేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వచ్చిన హైపర్ ఆది కామెడీతోపాటు సెటైర్లు అద్భుతంగా పేలాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికీ మంచి హితబోధన చేశాడు.ఎలా ఆడాలో చెప్పుకొచ్చాడు.

    దసరా సందర్భంగా అరగంట పాటు సాగిన హైపర్ ఆది పర్ ఫామెన్స్ కోసం బిగ్ బాస్ టీం కూడా భారీగానే ఖర్చు పెట్టిందట.. దీనికోసం హైపర్ ఆదికి ఏకంగా రూ.2 లక్షల రూపాయల పారితోషికం ఇచ్చిందట.. అరగంటకే 2 లక్షలంటే హైపర్ ఆది క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు. షో హిట్ కావడం.. ఆది పంచులు పేలడంతో అతడికి మరింత డిమాండ్ వచ్చింది.