https://oktelugu.com/

Prakash Raj: ప్రకాష్ రాజ్ మొదటి భార్య హీరో శ్రీహరికి ఏమవుతుందో తెలుసా?

Prakash Raj: దేశం మెచ్చిన నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. నటుడిగా ప్రకాష్ ఎంత ఫేమస్సో, వివాదాలతో కూడా అంతే ఫేమస్. గొప్ప నటుడైనప్పటికీ ప్రకాష్ రాజ్ కి క్రమశిక్షణ లేదని తోటి నటులు ఓపెన్ గానే చెబుతారు. దర్శకులు, నిర్మాతల చేత ఆయన బహిష్కరణలు ఎదుర్కొన్నారు. తెలుగు సినిమా నిర్మాతల సంఘం ఆయనపై ఒకప్పుడు బ్యాన్ విధించింది. డబ్బులు తీసుకుని షూటింగ్ కి రాడని పలువురు నిర్మాతలు ఆరోపించారు.   ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత […]

Written By:
  • Shiva
  • , Updated On : January 28, 2022 / 12:54 PM IST
    Follow us on

    Prakash Raj: దేశం మెచ్చిన నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. నటుడిగా ప్రకాష్ ఎంత ఫేమస్సో, వివాదాలతో కూడా అంతే ఫేమస్. గొప్ప నటుడైనప్పటికీ ప్రకాష్ రాజ్ కి క్రమశిక్షణ లేదని తోటి నటులు ఓపెన్ గానే చెబుతారు. దర్శకులు, నిర్మాతల చేత ఆయన బహిష్కరణలు ఎదుర్కొన్నారు. తెలుగు సినిమా నిర్మాతల సంఘం ఆయనపై ఒకప్పుడు బ్యాన్ విధించింది. డబ్బులు తీసుకుని షూటింగ్ కి రాడని పలువురు నిర్మాతలు ఆరోపించారు.

    Prakash Raj

     

    ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు, ఒడిదుడుకులు ఉన్నాయి. మొదటి భార్యతో విడిపోయిన ప్రకాష్ రాజ్ రెండో వివాహం చేసుకున్నారు. 1994లో ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నారు. అయితే లలిత కుమారి ఎవరో కాదు స్వయానా శ్రీహరి మరదలు. శ్రీహరి భార్య డిస్కో శాంతికి సొంత సిస్టర్ అవుతుంది లలిత కుమారి. ప్రకాష్ రాజ్-లలిత కుమారిలకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే కొడుకు 2004లో అనుకోని ప్రమాదంలో మరణించాడు.

    Also Read: Mango Media: క్షమాపణలు చెప్పిన ‘మ్యాంగో వీడియోస్’

    13ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం ప్రకాష్-లలిత కుమారికి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. లలిత కుమారి బావ అయిన శ్రీహరి ఈ విషయంలో కలుగజేసుకొని, సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. కాంప్రమైజ్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రకాష్ రాజ్ దంపతులు విడాకులకే మొగ్గు చూపడంతో 2009లో అధికారికంగా విడిపోయారు. లలిత కుమారితో విడిపోయిన ప్రకాష్ రాజ్ తన ఇద్దరు కూతుళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు.

    Prakash Raj

    లలిత కుమారితో విడాకుల తర్వాత ప్రకాష్ రాజ్ 2010లో పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్. తెలుగులో కూడా ఈమె కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. వీరికి 2015లో ఒక అబ్బాయి జన్మించాడు. ఈ విషయం ఇలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగు తమిళం కన్నడ మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 8 కి పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.

    కాగా మా అధ్యక్షుడు పదవికి ప్రకాష్ రాజ్ పోటీపడ్డారు. మంచు విష్ణు మరో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. మా ఎన్నికలు కేంద్రంగా అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.

    Also Read:  కరోనా ముప్పు తొలగేలా లేదా? కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి

    Tags