Mangalavaram Collection: దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. అదిరిపోయే ట్విస్ట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా నడిపారని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర చేసింది. చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ రోల్ చేసింది. తెగించి శృంగార సన్నివేశాల్లో నటించింది. మంగళవారం పాయల్ ఫేట్ మార్చేస్తుంది అందుకుంటే… కథ మళ్ళీ మొదటికే వచ్చింది. టాక్ కి వసూళ్లకు సంబంధం లేకుండా పోయింది. మంగళవారం మూవీ ఇంకా నష్టాల్లోనే ఉంది.
ఈ మూవీని వరల్డ్ కప్ దెబ్బతీసింది. ఓపెనింగ్ డే మంచి వసూళ్లు వచ్చాయి. వరల్డ్ కప్ ఫైనల్ మూడ్ లోకి వెళ్ళిపోయిన జనాలు శనివారం కూడా మంగళవారం మూవీ మీద ఆసక్తి చూపలేదు. ఆదివారం పూర్తిగా అన్ని సినిమాలను అవైడ్ చేశారు. దీంతో మంగళవారం వసూళ్ళు కోల్పోయింది. మంగళవారం సినిమాకు వచ్చిన టాక్ కి రికార్డు వసూళ్లు రాబట్టాల్సిందే. పాయల్ మూవీకి ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లే. అయితే సినిమా హిట్ కాలేకపోయింది.
కాంబినేషన్ తో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంళవారం మూవీ రూ. 12.5 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసింది. ఎటువంటి స్టార్ క్యాస్ట్ లేకుండా పాయల్ రాజ్ పుత్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే రికార్డు. రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన మంగళవారం ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఏపీ/తెలంగాణాలలో మంగళవారం మూవీ రూ. 7.17 కోట్ల షేర్ రూ. 12.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వరల్డ్ వైడ్ మంగళవారం 7 రోజులకు రూ.8.19 కోట్ల షేర్ రాబట్టింది. అంటే మరో రూ. 4 కోట్ల వసూళ్లు రాబడితే కానీ మంగళవారం హిట్ కాదు. నేడు కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. కాబట్టి మంగళవారం వసూళ్లు మరింత క్షీణించే అవకాశం ఉంది. హిట్ పడినా పాయల్ రాజ్ పుత్ కి సక్సెస్ దక్కలేదు. ఆమెను దురదృష్టం వీడలేదు. పాయల్ టైం బాగోలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం.