Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ కోసం దిగజారిపోయిన బిగ్ బాస్… ఇది మరీ వరస్ట్!

మర్డర్ టాస్క్ లో మొత్తం నలుగురు హౌస్ మేట్స్ చనిపోయారు. ప్రశాంత్, అశ్విని, గౌతమ్ లను బిగ్ బాస్ కావాలనే చంపేశారు. ఆయనే పేర్లు చెబుతూ కంటెండర్ షిప్ నుంచి తొలగించారు. మర్డర్ చేయడం లో విఫలమైన శివాజీని పక్కకి తప్పించి, ఆ పనులు ముద్దు బిడ్డ ప్రియాంక కు అప్పగించారు.

Written By: NARESH, Updated On : November 24, 2023 4:12 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ఫేవరిజం ఎక్కువైపోతోంది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ ను బిగ్ బాస్ కాపాడుతున్న విధానం ఆడియన్స్ కి నచ్చడం లేదు. జనాలను పిచోళ్ళని చేస్తూ ఓట్లతో సంబంధం లేకుండా దత్త పుత్రిక శోభా శెట్టి ని కాపాడుతూ వచ్చారు బిగ్ బాస్. ఇక ఈ వారం కెప్టెన్సీ కూడా సీరియల్ బ్యాచ్ సభ్యులకే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నాడు. కాగా 12వ వారం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ వ్యవహరించిన తీరు సీరియల్ బ్యాచ్ కి సపోర్టింగ్ గా ఉన్నట్లు అర్ధమౌతుంది.

మర్డర్ టాస్క్ లో మొత్తం నలుగురు హౌస్ మేట్స్ చనిపోయారు. ప్రశాంత్, అశ్విని, గౌతమ్ లను బిగ్ బాస్ కావాలనే చంపేశారు. ఆయనే పేర్లు చెబుతూ కంటెండర్ షిప్ నుంచి తొలగించారు. మర్డర్ చేయడం లో విఫలమైన శివాజీని పక్కకి తప్పించి, ఆ పనులు ముద్దు బిడ్డ ప్రియాంక కు అప్పగించారు. అయితే పోలీస్ ఆఫీసర్లుగా ఉన్న అర్జున్, అమర్ లు హంతకుల్ని ఏమాత్రం గుర్తించలేదు. ముందు రతిక తర్వాత యావర్ చివర్లో శివాజీ పేరు చెప్పారు.

కనీసం వాటికి ఆధారాలు చెప్పలేక పోవడం గమనార్హం. ఇది ఒక ఎత్తయితే .. పోలీసులు టాస్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి కెప్టెన్సీ టాస్క్ కి అర్హులని బిగ్ బాస్ ప్రకటించడం మరీ దారుణం.ఇలా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్ లో సీరియల్ బ్యాచ్ సభ్యులు నలుగురూ ఉన్నారు. అయితే అర్జున్ .. శోభాలో ఎవరు కెప్టెన్ కావాలని అనుకుంటున్నారు అని అడగ్గా .. శోభా శెట్టి ఫోటో కాల్చేశాడు గౌతమ్.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం అమర్ దీప్ కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. ఇంత వరకు అమర్ కెప్టెన్ కాలేదు. ఇది కన్ఫర్మ్ కాకపోయినా వీళ్ళని గెలిపించేందుకు బిగ్ బాస్ చేస్తున్న ప్లాన్ మరీ వరస్ట్ గా ఉంది. ఇదంతా చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ ని తిట్టిపోస్తున్నారు. కావాలనే సీరియల్ బ్యాచ్ ను బిగ్ బాస్ కాపాడుతున్నారని .. గత కొంత కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అదే నిజం అన్నట్టుగా బిగ్ బాస్ చేస్తున్నాడు.