Mega 156: మెగా 156 టైటిల్ లీక్… ఆ ఫోటోలు బయటకు రావడంతో పిచ్చ క్లారిటీ!

మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ కి కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. భోళా శంకర్, గాడ్ ఫాదర్ రీమేక్స్ కాగా సరైన ఫలితాలు ఇవ్వలేదు. భోళా శంకర్ ఫెయిల్యూర్ నేపథ్యంలో రీమేక్స్ వద్దని అభిమానులు సలహా ఇచ్చారు.

Written By: NARESH, Updated On : November 24, 2023 4:17 pm

Mega 156

Follow us on

Mega 156: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు చిరంజీవి. గత ఏడాదిన్నర కాలంలో చిరంజీవి నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. చిరంజీవి లేటెస్ట్ రిలీజ్ భోళా శంకర్ నిరాశపరిచింది. దారుణ పరాజయం చూసింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చిరంజీవి ఆలోచనలో పడ్డారు. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఓకే చేసిన ప్రాజెక్ట్ పక్కన పెట్టారు.

మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ కి కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. భోళా శంకర్, గాడ్ ఫాదర్ రీమేక్స్ కాగా సరైన ఫలితాలు ఇవ్వలేదు. భోళా శంకర్ ఫెయిల్యూర్ నేపథ్యంలో రీమేక్స్ వద్దని అభిమానులు సలహా ఇచ్చారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ వదులుకున్నారు. బింబిసార ఫేమ్ వశిష్టకు ఆఫర్ ఇచ్చాడు. వశిష్టతో మూవీ కూడా ముందుగా అనుకున్నదే. మెగా 157 కాస్త 156 అయ్యింది.

మరోసారి వశిష్ట సోషియో ఫాంటసీ సబ్జెక్టు ఎంచుకున్నాడు. పంచ భూతాలైన గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్నితో కూడిన లోగో ఆకట్టుకుంది. ఇది మూడు లోకాలకు సంబంధించిన కథ అట. మూడు లోకాల్లో ముగ్గురు హీరోయిన్స్ తో చిరంజీవి రొమాన్స్ చేస్తాడని టాక్. ఇటీవల షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్ర టైటిల్ గురించి కొన్నాళ్లుగా చర్చ జరుగుతుంది. ఓ టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ వచ్చింది.

ప్రచారం అయినట్లే విశ్వంభర టైటిల్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. విశ్వంభర టైటిల్ తో కూడిన క్లాప్ బోర్డు కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఇది రామ్ చరణ్-శంకర్ సినిమాకు అనుకున్నారట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇంగ్లీష్ టైటిల్ బెటర్ అని గేమ్ ఛేంజర్ కి ఫిక్స్ అయ్యారట. విశ్వంభర అంటే ఈ విశ్వాన్ని కాపాడేవాడు, విశ్వానికి రాజు, ఏలేవాడు అనే అర్థాలు వస్తాయి. ఈ చిత్ర ఇతర క్యాస్ట్ వివరాలు తెలియాల్సి ఉంది.