ఏభై ఏళ్లకు దగ్గర పడిన ఆడవాళ్లు ఎలా ఉంటారు. శరీరంలో వృద్ధాప్యం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎంత దాచుకున్నా.. ఎన్ని వర్కౌట్స్ చేసినా ముసలితనాన్ని ఎవ్వరూ దాచలేరు. అయితే, ఒక సీనియర్ నటి మాత్రం తనలోని వయసును కనబడనీవ్వదు. బహుశా ఆమెలా వయసును మ్యానేజ్ చేసే విషయంలో మరొకరు పోటీ పడలేరేమో. ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం అంతా అంటే.. ఆమె పేరు ‘మందిరా బేడీ’
ఆమె గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. మరో మూడు నెలల్లో ‘మందిరా బేడీ’ 50లోకి అడుగుపెట్టబోతుంది. మహామహా అందగత్తెలే నలభై దాటిన తరువాత ముడతలు పడిన మొహాన్ని దాచుకోవడానికి ఓవర్ గా మేకప్ వేసుకుని బయటకు వస్తారు. అతిలోక సుందరి శ్రీదేవి దగ్గర నుండి ఇప్పటి ఐశ్వర్యరాయ్ వరకూ చేసేది ఇదే. కానీ మందిరా బేడీ అలా కాదు. అసలు ఆమెను మేకప్ లేకుండా చూసినా.. ఏభై ఏళ్ల వయసు ఉన్నట్లు అనిపించదు.
అందుకే అవసరం లేకపోయినా.. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో తనలోని ఫిట్ నెస్ ను చూపించే ఫోటోలు పెడుతూ ఉంటుంది. ఆ ఫోటోలు చూస్తే మతిపోతుంది. అయితే ఆమెకు ఫిట్ నెస్ అంత ఈజీగా ఏమి రాలేదు. తన ఫిట్నెస్ కోసం యంగ్ ఏజ్ లో హీరోయిన్లు కంటే కూడా, మందిరా బేడీ ఎక్కువ శారీరక శ్రమ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ జిమ్ లో రోజూ నాలుగు గంటలు కష్టపడుతుంది.
అందువల్లే ఈ వయసులో కూడా ఆమె సింగిల్ డేలోనే ఏకంగా 17000 అడుగులు వేస్తూ.. 1800 క్యాలరీలు కరిగిస్తూ నెటిజన్లకు షాక్ ను ఇచ్చింది. పరీక్షగా చూసిన మందిరా బేడీలో పొట్ట అనేది కనిపించదు. ఆమె బాడీలో అనవసరపు కొవ్వు అనేదే లేదు. మొత్తానికి మందిరా బేడీ నిత్యం తన ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ కాలక్షేపం ఇస్తూ అలాగే చేస్తూ ఉంటుంది. ఇక ఆమె తాజగా అప్ డేట్ చేసిన ఈ వర్క్ అవుట్ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది.