Manchu Vishnu: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ వ్యక్తిగత సిబ్బంది మృతులల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ ఒకరు. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ కూడా వీర మరణం పొందారు. దీంతో సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయితేజ ఆకస్మిక మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిజేస్తున్నారు. సాయితేజ కుటుంబానికి అండగా నిలబడతామని అంటున్నారు.
కాగా సాయి తేజ్ భార్య శ్యామలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ కుటుంబానికి తాము అండగా ఉంటామని మంచు విష్ణు చెప్పారు. అంతే కాకుండా సాయితేజ… కొడుకు, కుమార్తెల చదువు మొత్తం తమ విద్యాసంస్థ విద్యానికేతన్ భరిస్తుందని ప్రకటించారు. సాయి తేజ్ పిల్లలు చదువు ఇంజనీరింగ్ వరకు తమ విద్యా సంస్థలోనే ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సాయి తేజ కుటుంబాన్ని విద్యనికేతాన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. త్వరలో సాయితేజ కుటుంబాన్ని వారం, పదిరోజుల్లో నేరుగా వెళ్లి కలనున్నానని మంచు విష్ణు చెప్పారు. సాయి తేజ్ ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Also Read: ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన !
మరోవైపు జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్ మార్గ్‌లోని రావత్ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతిస్తారు. ఆ తర్వాత 2గంటల నుంచి రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ స్మశాన వాటికల్..సైనిక లాంచనాలతో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Also Read: మరదలి పెళ్ళిలో డాన్స్ ఇరగతీసిన రామ్ చరణ్…