https://oktelugu.com/

RRR Movie: రికార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​

RRR Movie: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 09:26 AM IST
    Follow us on

    RRR Movie: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్​ను నిన్న విడుదల చేసింది చిత్రబృందం. రిలీజ్​ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్​కు చేరుకుని.. ప్రభంజనం సృష్టించింది. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్​ ఫాస్టెస్ట్​ 1 మిలియన్​ లైక్స్​ ట్రైలర్​గా నిలిచి.. ఆల్​టైమ్​ నెంబర్​ 1 స్థాయిలో నిలిచింది. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్​కు చేరువలో ఈ ట్రైలర్​ నెట్టింట దూసుకెళ్లిపోతోంది.

    RRR

    అయితే, హిందీ వర్షన్​లోనూ విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​కు తెలుగుతో సమానమైన రెస్పాన్స్​ వస్తోంది. ఇప్పటికే 17 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసిన భారీ స్థాయిలో మంచి స్పందనను రాబట్టింది. మొత్తానికి సినిమాపై ఎక్కడలేని హైప్​ ఒక్క ట్రైలర్​తో జక్కన్న క్రియేట్​ చేశారు.

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…

    ఈ సినిమాలో తారక్​ భీమ్​గా కనిపించనుండగా.. చరణ్​ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. ట్రైలర్​లోనూ అందుకు సంబంధించిన క్లిప్స్​ను పెట్టారు మేకర్స్​. ట్రైలర్​ చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.  ఈ సినిమాలో అజయ్​ దేవగణ్​ పాత్ర కూడా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రను చూస్తుంటే భగత్​సింగ్​ ఇన్​స్పిరేషన్​తో తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే.. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?