Manchu Vishnu : చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) ‘భైరవం'(Bhairavam Movie) చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న రాత్రి ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గడిచిన కొద్దిరోజులుగా ఆయన కుటుంబం లో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ గొడవల్లో తప్పు ఎవరిదీ అనేది మన కళ్లారా చూడకుండా ఏకపక్షంతో చెప్పలేము కానీ, మనోజ్ వైపు నెటిజెన్స్ అందరూ చాలా బలంగా నిలబడ్డారు.
Also Read : నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
మొదటి నుండి మంచు కుటుంబం లో మనోజ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ సంఘటన తర్వాత అది ఇంకా పెరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘నా AV చూసిన తర్వాత నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేను మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, మీకు కష్టం వచ్చినప్పుడు నేను మీ పక్కన లేను, సినిమాలకు దూరమై 9 ఏళ్ళు దాటింది. అయినప్పటికీ అభిమానులు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సొంత మనుషులే దూరం పెట్టిన ఈ రోజుల్లో, అభిమానులు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. లాక్ డౌన్ కి ముందు కొన్ని సినిమాలు ప్రారంభించాను, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాటిని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. శివయ్యా అంటే శివుడు రాడు..మనస్ఫూర్తిగా తల్చుకుంటే మా డైరెక్టర్ రూపం లోనో, మా నిర్మాత రూపం లోనో వస్తాడు’ అంటూ తన అన్నయ్య మంచు విష్ణు పై మనోజ్ సెటైర్ల వర్షం కురిపించాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ తమ్ముడు బెల్లంకొండ శ్రీనివాస్ తో షూటింగ్ మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. ఇద్దరం ఎన్నో జోక్స్ వేసుకునే వాళ్ళం. ఇతన్ని చూసినప్పుడల్లా నాకు ఇలాంటి తమ్ముడు పుట్టలేదు అని బాధ వేస్తుంది. ఏ చిన్న కష్టమొచ్చినా ఈ మనోజ్ నీకు ఎప్పుడూ తోడు ఉంటాడు తమ్ముడు’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పుకొచ్చాడు. అదే విధంగా నారా రోహిత్ గురించి మాట్లాడుతూ ‘నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నతనం నుండి అతనితో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 2017 లో నేను ‘ఒక్కడు మిగిలాడు అనే చిత్రం చేసాను. ఈ 9 ఏళ్లలో నేను చేసిన సినిమా అదే. ఈ చిత్రానికి నారా రోహిత్ వాయిస్ ఓవర్ అందించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర కోసం పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ని తీసుకొని రాగల సత్తా మీకు ఉంది. కానీ మీకు ఈ తిరుపతి అబ్బాయి గుర్తుకొచ్చాడు, అందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.