https://oktelugu.com/

మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టిన మంచు విష్ణు !

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి , క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కుటుంబానికి కొన్నాళ్ళు పాటు మాటలే లేవు. బాహాటంగానే ఒకర్ని ఒకరు దెప్పి పొడుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత అన్ని విబేధాలు తొలిగిపోయి ఇరు కుటుంబాలు ఏకమయ్యాయి. మంగళవారం నాడు మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరుతో చాలాసేపు ముచ్చటించానని చెబుతూ చిరుతో తీసుకున్న సెల్ఫీ పిక్ ట్విట్టర్ లో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. Also […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 04:18 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి , క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కుటుంబానికి కొన్నాళ్ళు పాటు మాటలే లేవు. బాహాటంగానే ఒకర్ని ఒకరు దెప్పి పొడుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత అన్ని విబేధాలు తొలిగిపోయి ఇరు కుటుంబాలు ఏకమయ్యాయి. మంగళవారం నాడు మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరుతో చాలాసేపు ముచ్చటించానని చెబుతూ చిరుతో తీసుకున్న సెల్ఫీ పిక్ ట్విట్టర్ లో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.

    Also Read: బిగ్‌బాస్‌ 4‌లో అభిజిత్ ‌కు… కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్యాకేజ్ !

    విష్ణు ట్విట్టర్ లో ‘బిగ్‌బాస్‌… చిరంజీవి అంకుల్‌ని ఈరోజు కలిశాను. ఆయనకు ఎన్నో ప్రశ్నలు సంధించి… సమాధానం రాబట్టుకునే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఆయన ఇచ్చిన సమాధానాలతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన మెగాస్టార్‌ ఎందుకయ్యారో అనే విషయంలో అస్సలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు’,ఎందుకు ఆయనని కలిశాననేది త్వరలోనే రివీల్‌ చేస్తాను అంటూ ట్వీట్ చేశారు.విష్ణు అసలు విషయం చెప్పకుండా అభిమానులని సందిగ్ధంలో పడేయటంతో చిరుని ఎందుకు కలిసి ఉంటాడో అని చర్చ జరుగుతుంది.

    Also Read: స్టార్ హోటల్లో దాక్కున్న KGF రాకీ భాయ్ .. కారణం తెలిస్తే షాకింగే!

    ఈ వ్యవహారం మీద ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మంచు విష్ణు నిర్మిస్తూ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మోస‌గాళ్లు’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకి ముస్తాబవుతుంది. మోస‌గాళ్లు సినిమాను జెఫ్రీ చీ గిన్ అనే హాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డం కోస‌మే మెగాస్టార్‌ను మంచు విష్ణు క‌లిశార‌ని వార్త‌లు వినిపిస్తుండ‌గా, చిరు న‌టిస్తున్న మల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో మంచు విష్ణు పృధ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వుంద‌ని, ఆ కార‌ణంగానే చిరుని మంచు విష్ణు క‌లిశారంటూ మ‌రో వార్త వినబడుతుంది. త్వరలో మంచు విష్ణు నే అసలు విషయం రివీల్ చేసేవరకు ఇలాంటి పుకార్లు చాలానే వినిపిస్తాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్