Dhanush vs Balayya: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అంటే మాత్రం ప్రతి దర్శకుడు కి ధనుష్ గుర్తుకువస్తుంటాడు. అందుకే ప్రతి డైరెక్టర్ మంచి కథ రాసుకొని అతనికి వినిపించి ఆయన చేత ఆ క్యారెక్టర్ లో నటింప చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నిజానికి ఆయన ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి తను డీ గ్రేడ్ క్యారెక్టర్ చేస్తే వాళ్ళ అభిమానులు ఫీల్ అయిపోతారేమో, తమ మార్కెట్ పడిపోతుందేమో అనే ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా మంచి క్యారెక్టర్లు చేస్తుంటాడు. మంచి పాత్ర దొరికితే అందులో నటించడమే కాకుండా ఆ పాత్ర కి 100% న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో తను కూడా ఒకడు అనే గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి… ఇక ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల (Shekar Kammula) చేసిన కుబేర (Kubera) సినిమాలో బిచ్చగాడిగా నటించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. అలాగే ధనుష్ పోషించిన బిచ్చగాడి పాత్రకి చాలా మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక తెలుగులో ధనుష్ లాగా నటించే నటుడు ఎవరు లేరా బిచ్చగాడి పాత్రలో మన హీరోలు ఎందుకు నటించరు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య బాబు (Balayya Babu) హీరోగా వచ్చిన భైరవద్వీపం (Bhairava dwipam) సినిమాలో బాలయ్య ఒక పది నిమిషాల పాటు కుష్టు వ్యాధి సోకిన వ్యక్తిగా ముసలివాడిగా నటిస్తాడు.
Also Read: Balayya : బాలయ్య ఆ దర్శకుడిని పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?
ఇక ఆ పాత్రలో బాలయ్య బాబు కొద్దిసేపు బిచ్చగాడిలా నటిస్తాడు. అలాగే తన కుష్టు వ్యాధి విరుగుడు అయ్యేలా శాప విముక్తి కలిగించమని ప్రార్థిస్తూ తనకు క్షమాభిక్ష పెట్టమని అడుగుతాడు. బాలయ్య బాబు చేసిన ఆ బిచ్చగాడు పాత్రలో తన పూర్తి పర్ఫామెన్స్ ని చూపించి చాలా అద్భుతంగా నటించాడు అని అందరి చేత ప్రశంసలను అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్రకి కూడా మంచి గుర్తింపు లభించినప్పటికి బాలయ్య బాబు చేసిన ఆ పాత్ర ముందు ధనుష్ పెద్దగా చేసింది ఏమి లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి బాలయ్య బాబు (Balayya Babu) లాంటి నటుడు అప్పట్లోనే అలాంటి ఒక డిఫరెంట్ పాత్రను పోషించడానికి సిద్ధపడడం అనేది అప్పట్లో డేరింగ్ డెసిజన్ అనే చెప్పాలి.
ఎందుకంటే అప్పట్లో బాలయ్య బాబుకి మంచి ఫాలోయింగ్ ఉండేది. అలాంటిది ఒక కమర్షియల్ హీరో అలాంటి పాత్రను చేయడం అనేది నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. బాలయ్య కొత్తదనాన్ని ఎప్పుడు స్వీకరిస్తూ ఉంటాడు. ఆయన మొదటి నుంచి కూడా చాలెంజింగ్ క్యారెక్టర్లు చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ…