Alitho Saradaga: అలీ వ్యాఖ్యాతగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘అలీ తో సరదాగా’ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అలీతో సరదాగా 249 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకోగా, 250 ఎపిసోడ్ కి గాను మోహన్ బాబు ని ఆహ్వానించారు షో నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ నే రెండు పార్టులుగా చేసి ప్రసారం చేశారు షో నిర్వాహకులు. పార్ట్ 1 గత సోమవారం ప్రసారం కాగా… పార్ట్ 2 నిన్న సోమవారం ప్రసారం అయ్యింది.

ఇందులో భాగంగా గత వారం ప్రసారమైన ఎపిసోడ్ లో మోహన్ బాబు తన సినీ కెరీర్ గురించి, వ్యక్తి గత జీవితం గురించి ఎన్నో విషయాలు, విశేషాలు చెప్పారు. ముఖ్యం గా నటుడిగా తన జీవితం ఎలా మొదలయింది, సినీ ఇండస్ట్రీ లో రావడానికి ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది … ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు మోహన్ బాబు అలీతో సరదాగా లో పంచుకున్నాడు.
నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకింత భావోద్వాగానికి గురయ్యారు మోహన్ బాబు. అలీ కొన్ని ప్రశ్నలను మోహన్ బాబు కి సంధిచగా నేను ‘నా జీవిత చరిత్ర’ రాయాలనుకుంటున్నాను… కానీ, ఇప్పుడు నా జీవితం మొత్తాన్ని ఇక్కడే అడిగేస్తున్నావు అని మోహన్ బాబు సమాధానం ఇచ్చి అలీని ఒకంత ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు స్వరాభిషేకంలో మోహన్ బాబు గురించి ప్రస్తావిస్తూ ఉన్న ఒక వీడియో క్లిప్ ప్లే చేయిస్తాడు అలీ. ఆ వీడియో లో మోహన్ బాబు గురించి సుమ తో ఇలా అంటాడు…. ఇవ్వనంటాడు .. ఏం చేయమంటావు సుమా..! నేను నీకు ఇవ్వనయ్యా ఆ వంద రూపాయలు.. అవి మాత్రం నా దగ్గర ఉండి తీరాల్సిందే.. నువ్వు మాటి మాటికీ అడిగావనుకో ఒకవేళ నా అదృష్టం అంతా పోతుందని భయం ..అని సుమతో చెప్తాడు గాన గంధర్వుడు ఎస్పీ బాలు మోహన్ బాబు గురించి. ఈ విషయాన్నీ అలీ తో సరదాగా లో మోహన్ బాబు కి గుర్తు చేసి భావోద్వేగానికి గురి చేస్తాడు అలీ.