Manchu Manoj with his mother: భిన్నమైన కథాంశాలతో, అద్భుతమైన పాటలతో ఒకప్పుడు మంచు మనోజ్(Manchu Manoj) యూత్ ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ ఒక పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం లో విలన్ క్యారక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా కంటే ముందుగా ‘భైరవం’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ, నిన్న విడుదలైన ‘మిరాయ్’ చిత్రానికి మాత్రం మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే వసూళ్లు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం లో మనోజ్ పేరుకే విలన్ క్యారక్టర్ చేశాడు కానీ, ఆయన పాత్ర ప్రారంభం నుండి చివరి వరకు హీరో క్యారక్టర్ కంటే పవర్ ఫుల్ గా ఉంటుంది.
అంతే కాకుండా హీరో కంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు మనోజ్ కే ఉన్నాయి. ఆయన పాత్రకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే చాలా కాలం తర్వాత వచ్చిన సక్సెస్ కావడం తో మనోజ్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. తన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలియజేసిన మనోజ్, తన తల్లి ఈ సినిమా విజయం పట్ల నన్ను చూసి ఎంతో గర్విస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మనోజ్ కి ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా, ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా మనోజ్ సిద్ధం అవ్వడం ఆయన తన జీవితం లో తీసుకున్న మంచి నిర్ణయం అని అనుకోవచ్చు.
ఇప్పుడు ‘మిరాయ్’ క్యారక్టర్ ద్వారా ఆయన ఒక జెనరేషన్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇలా దగ్గరయ్యాక ఆయన ఇప్పుడు హీరో గా మూడు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ మూడు సినిమాలతో మళ్లీ మంచు మనోజ్ పూర్వ వైభవాన్ని చూస్తాడో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ ని సాధించిన తర్వాత రెండవ రోజు కూడా చాలా బలమైన నూన్ షోస్ తో మొదలైంది ఈ చిత్రం. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 21 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ ఏడాది లో స్టార్ హీరోల సినిమాలకు కూడా రెండవ రోజు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఎక్కడా చూడలేదు. చూస్తుంటే ఈ సినిమా వీకెండ్ వరకు బాగా ఆడి వెళ్లిపోయే సినిమా కాదని, లాంగ్ రన్ లో అదరగొట్టే సినిమా అని తెలుస్తుంది.