Ritika Nayak unknown facts: నిన్న విడుదలైన తేజ సజ్జ(Teja Sajja) ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ని చూస్తుంటే,కేవలం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకునేలా అనిపిస్తుంది. సినిమాని నిర్మించడానికి 60 నుండి 70 కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యింది. నాన్ థియేట్రికల్ + థియేట్రికల్ కలిపి విడుదలకు ముందే నిర్మాత సేఫ్ అయ్యాడు. ఇప్పుడు బయ్యర్స్ కూడా వీకెండ్ తో సేఫ్ అవ్వబోతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిన టాలీవుడ్ కి ఈ సెప్టెంబర్ నెలలో ఒక దాని తర్వాత ఒకటి సూపర్ హిట్ అవుతూ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కొత్త ఊపిరిని పోశాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రితికా నాయక్(Rithika Nayak) గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.
ఈమె గురించి ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు. వివరాల్లోకి వెళ్తే ఈమె 1997 వ సంవత్సరం, అక్టోబర్ 27 న జన్మించింది. చదువు పరంగా డిగ్రీ పూర్తి చేసిన ఈమెకు చిన్నతనం నుండే నటన పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి తోనే మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలు పెట్టింది. అంతే కాదు ఈమె 2019 లో జరిగిన ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ లో టైటిల్ విన్నర్ గా నిల్చింది. అక్కడి నుండే ఈమెకు అవకాశాలు రావడం మొదలైంది. 2022 వ సంవత్సరం లో విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా రితిక నాయక్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఎవరు ఈ అమ్మాయి చూసేందుకు చాలా అందం గా ఉంది, చలాకీ గా కూడా ఉంది అని ప్రేక్షకులు అనుకున్నారు.
ఈ సినిమా తర్వాత ఆమె నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం లో ఒక కీలక పాత్ర చేసింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పుడు ‘మిరాయ్’ చిత్రం తో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇక్కడి నుండి ఆమె తన కెరీర్ ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. ఇంకొక్క సినిమా హిట్ అయితే మాత్రం ఈమె టాలీవుడ్ కి మరో శ్రీలీల లాగా మారిపోగలదు. మరి అంత దూరం వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది.