Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవితో పాటు పోటీగా నటించి విలన్ గా, హీరోగా తనదైన మార్క్ నటనతో మంచి గుర్తింపు పొందిన హీరో మోహన్ బాబు.ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ ఉన్నారు.ఇక ఇందులో విష్ణు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా మనోజ్ మాత్రం సినిమాలకి కొద్ది సంవత్సరాల నుంచి బ్రేక్ ఇచ్చాడు.
ఇక ఈ క్రమంలోనే ఈయన కొద్దిరోజుల క్రితం భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దివంగత భూమా నాగిరెడ్డి,శోభ నాగిరెడ్డి అలాగే మోహన్ బాబు నిర్మల దంపతులు మరోసారి గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారు మీ ప్రేమ మద్దతు మాకు ఎప్పుడూ ఉండాలి అంటూ ట్వీట్ చేశాడు…
ఇక ఇప్పుడు ఈ ట్వీట్ నెట్లో చాలా వైరల్ అవుతుంది. మనోజ్ తండ్రికాబోతున్నాడు అనే విషయాన్ని ఇలా తన అభిమానులతో పంచుకున్న మనోజ్ మరో మంచి న్యూస్ చెప్పాడంటూ తన అభిమానులు కూడా ఆనంద పడుతున్నారు. అలాగే తను ఈమధ్య ఒక టీవీ షో కూడా చేస్తున్నాడు. ఇక దీంతో అతని అభిమానులు మనోజ్ మొన్నటిదాకా కెరియర్ పరంగా కొంచెం వెనుకబడినప్పటికీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోను సినిమా కెరియర్ పరంగా ముందుకు దూసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మనోజ్ ఇక సినిమాలను కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఇప్పటికే ఒక సినిమాకి కమిట్ అయి ఆ సినిమా షూటింగ్ ప్రాసెస్ లో బిజీ గా ఉన్నాడు.
ఇక మంచు ఫ్యామిలీలో మనోజ్ కి మంచి రోజులు వచ్చాయంటూ మరి కొంతమంది కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా సంవత్సరాల పాటు మొఖానికి మేకప్ వేసుకోకుండా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్న మనోజ్ ఈ సంవత్సరం తనదైన రీతిలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం అలాగే పెళ్లి చేసుకోవడం అలాగే ఇప్పుడు తండ్రి కాబోతుండటం ఇటు టీవీ షోలు, అటు సినిమాలు అంటూ చాలా మనోజ్ చాలా బిజీ గా మారిపోయాడు.చూడాలి మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మేరకు రాణిస్తాడో…
“Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday ❤️
Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn
— Manoj Manchu❤️ (@HeroManoj1) December 16, 2023