AB de Villiers: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం కి ఇప్పటివరకు 5 కప్పులను అందించి ఒక గొప్ప కెప్టెన్ గా మంచి రికార్డును సాధించాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటివరకు తన కెప్టెన్సీలో అద్భుతంగా మ్యాచులను ఆడి తన కెప్టెన్సీ లో ప్లేయర్లు గొప్పగా ఆడే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.
ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పిస్తూ హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా చేస్తున్నామంటూ ప్రకటించింది అయితే రోహిత్ ని కెప్టెన్ గా తీసేయడం ముంబై లో ఏ ప్లేయర్ కి నచ్చడం లేదనే విషయం కూడా తెలుస్తుంది. ఇక దాంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు.ఇక దాంతో రోహిత్ ని తొలగించడం పట్ల నెగెటివిటీని స్ప్రెడ్ చేసే విధంగా సోషల్ మీడియాలో అతని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక రోహిత్ లాంటి ఒక గొప్ప కెప్టెన్ ని ఎందుకు అలా తీసేసారు అంటూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ అయిన ఎబి డివిలియర్స్ ఈ విషయం పైన స్పందిస్తూ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడం తప్పయితే కాదు ఎందుకంటే ఆయన ఇప్పటికే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా తనని తను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటికే ఇండియన్ టీం తరపున కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఐపిఎల్ అదనపు భారం అవుతుందేమో అందుకే అందులో ఉండే ప్రెజర్ ని తగ్గించుకోవడానికి తప్పుకోవాలనుకున్నాడేమో ఈ విషయం లో ముంబై టీమ్ హార్థిక్ పాండ్య ని కెప్టెన్ గా చేయడం కరెక్టే…ఎందుకంటే హార్థిక్ పాండ్య కెప్టెన్ గా తనదైన డిసిజన్స్ తీసుకుంటూ టీంను ముందు ఉండి నడిపించడంలో ప్రస్తుతం ఆయన ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కెప్టెన్ గా నియమించడంలో ముంబై టీమ్ ఏ మాత్రం తప్పు చేయలేదు.
హార్థిక్ పాండ్యా ఒకసారి ట్రోఫీ కొట్టి చూపిస్తే ఆయన మీద వచ్చే విమర్శలు తగ్గిపోతాయి అంటూ తను స్పందించాడు. ఇలా మొత్తానికి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించడం మీద కొంతమంది నెగిటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా లేకపోతే మేము ముంబై ఇండియన్స్ అభిమానులుగా ఉండలేము అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి ముంబై ఇండియన్స్ టీం కి హార్దిక్ పాండ్య 2024 లో కప్పు తీసుకొస్తాడా లేదా అనేది…