Manchu Manoj: మంచు కుటుంబం లో వివాదం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇలా వీధి మీదకు రావడం, అది కూడా మోహన్ బాబు లాంటి పెద్ద కుటుంబం నుండి రావడం ఆశ్చర్యార్ధకం. మొన్న రాత్రి మోహన్ బాబు తనపై, తన భార్యాపిల్లలపై దాడి చేసాడని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కొట్టడమే కాకుండా, తన అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా నిన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకోవడం వంటివి మనం చూసాము. మంచు మనోజ్ కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ కూడా మీడియా కి లీక్ అయ్యింది. మధ్యలో మోహన్ బాబు పీఆర్ టీం గొడవలేవి జరగట్లేదని కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది కానీ, నిజాన్ని దాచలేకపోయారు.
ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ కాసేపటి క్రితమే మీడియా తో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇది ఆస్తుల కోసం జరుగుతున్న పోరాటం కాదు, నా ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న పోరాటం. నా భార్య పిల్లల క్షేమం గురించి జరుగుతున్న పోరాటం. ఇది ఒక మగాడు నాతో నేరుగా వచ్చి తేల్చుకొని ఉండుంటే ఎలాంటి సమస్య లేదు. నన్ను తొక్కేదానికి నా భార్య, నా 7 నెలల పాప ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా, వాళ్ళు చూస్తూ ఉండగా నా పట్ల అలా ప్రవర్తించడం సరికాదు. ఈరోజు నేను పోలీసుల దగ్గరకి వెళ్లి రక్షణ కల్పించమని అడిగాను. నేను మీకు అన్ని ఆధారాలు ఇస్తాను, SI గారు ఇక్కడికి వచ్చి పరిస్థితి మొత్తాన్ని చూసి నేను మీకు రక్షణ ఇస్తాను సార్ అని చెప్పి వెళ్లారు. కానీ నేడు వాళ్లంతా పారిపోయారు. నాకోసం రక్షణ గా వచ్చిన వాళ్ళను బయటకి తరిమేసి, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళను లోపలకు పంపారు. పోలీసులు అయ్యుండి ఎందుకు ఇలా వివక్ష చూపిస్తున్నారు’ అంటూ మంచు మనోజ్ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసాడు.
అసలు గొడవ ఏమి జరిగింది సార్, ఎందుకు ఇంత దూరం వచ్చింది అని మీడియా ప్రతినిధులు మనోజ్ ని అడగగా, ఆయన సమాధానం చెప్పలేదు. మరో పక్క మంచు అమెరికా లో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన ఇండియా కి తిరిగి వస్తున్నాడని, నేరుగా మంచు మనోజ్ ఇంటికి చేరుకుంటాడని, వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగే అవకాశం ఉందని మీడియా లో కథనాలు ప్రచారం అయ్యాయి. మోహన్ బాబు విష్ణు కి రక్షణ కోసం 40 మంది బౌన్సర్లను దింపగా, మనోజ్ తన కోసం 30 మంది బౌన్సర్లను దింపాడు. అయితే నేడు పోలీసులు తన కోసం వచ్చిన బౌన్సర్లను బయటకి గెంటేసి, విష్ణు కోసం వచ్చిన వాళ్ళను మాత్రమే లోపలకు పంపారట. దీనికి మంచు మనోజ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.