https://oktelugu.com/

ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !

అన్నీ ఉన్నా అదృష్టం లేకపోతే ఏమి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తోంది. నిజానికి మంచు మనోజ్ కి స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ, మాములు హీరోలాగే కూడా మనోజ్ సినిమాలు చెయ్యలేకపోతున్నాడు. కారణాలు ఎన్నో ఉండొచ్చు.. నిర్మాతలు మనోజ్ కి దూరం జరిగారు. పోనీ, ఓన్ ప్రొడ్యూసర్లు అన్నా మనోజ్ తో మంచి సినిమాలు చేస్తారు అనుకుంటే.. వాళ్ళు వాళ్ళ పర్సనల్ సినిమాల గోలలో ఉన్నారు తప్పితే.. మనోజ్ ని నిలబెట్టే ఆలోచనలో ఎవ్వరూ […]

Written By:
  • admin
  • , Updated On : August 16, 2020 / 11:13 AM IST
    Follow us on


    అన్నీ ఉన్నా అదృష్టం లేకపోతే ఏమి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తోంది. నిజానికి మంచు మనోజ్ కి స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ, మాములు హీరోలాగే కూడా మనోజ్ సినిమాలు చెయ్యలేకపోతున్నాడు. కారణాలు ఎన్నో ఉండొచ్చు.. నిర్మాతలు మనోజ్ కి దూరం జరిగారు. పోనీ, ఓన్ ప్రొడ్యూసర్లు అన్నా మనోజ్ తో మంచి సినిమాలు చేస్తారు అనుకుంటే.. వాళ్ళు వాళ్ళ పర్సనల్ సినిమాల గోలలో ఉన్నారు తప్పితే.. మనోజ్ ని నిలబెట్టే ఆలోచనలో ఎవ్వరూ లేరు. అందుకే పాపం మనోజ్ కెరీర్ కి చాలా గ్యాప్ వచ్చింది అంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తనే ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ పెట్టాడు. కాకపోతే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించానని మంచు మనోజ్ చెప్పినా.. ప్రొడక్షన్ హౌస్ మాత్రం తన కోసమే.

    Also Read: ‘మజిలీ – సమ్మోహనం’ కలయికలో చైతు !

    సరే ఓన్ సంస్థ పెడితే పెట్టావు, పాన్ ఇండియా రేంజ్ సినిమా అవసరమా అని అడుగుతున్నారట అందరూ. తన కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు మనోజ్. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. కచ్చితంగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ కి సినిమాకి ఇరవై కోట్లు మార్కెట్ కూడా లేదు. మరి ఎందుకు అప్పు చేసి మరీ పాన్ ఇండియా మూవీ అని మనోజ్ సన్నిహితులు మొహమాటపడకుండానే ఆయన్ని నిలదీస్తున్నారట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే మనోజ్ సినిమా పెట్టుబడికి డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: సంక్రాంతినే నమ్ముకున్న స్టార్ హీరోలు !

    మొత్తానికి మనోజ్ కాస్త ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పాపం చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్ కి, ఈ ఆర్ధిక కష్టాలకు తోడు కరోనా కూడా పెద్ద అడ్డుగా నిలబడింది. లేకపోతే మనోజ్ సినిమా ఫస్ట్ డే షూట్ రోజే లాక్ డౌన్ ఎనౌన్స్ మెంట్ రావడం ఏమిటి కామెడీ కాకపోతే. ఇక కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏమైనా మనోజ్ కి ఈ సినిమాతోనైనా మంచి హిట్ వస్తోందేమో చూడాలి.