https://oktelugu.com/

లెజెండ్రీ ధోని.. రిటైర్ వెనుకున్నది అతడేనా?

భారత క్రికెట్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ ఫీటును సాధించిన మహేంద్ర సింగ్ ధోని కరోనా వేళ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. ధోని మహాభిష్క్రమణ అందరినీ షాక్ కు గురిచేసింది. చివరి మ్యాచ్ ఆడకుండా.. అందరితో పొగిడించుకోకుండా.. సన్మానించకుండా ధోని ఇలా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే ధోనిని సగర్వంగా సాగనంపాలని తాజాగా జార్ఖండ్ సీఎం సోరేన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలని కోరాడు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2020 / 10:55 AM IST
    Follow us on


    భారత క్రికెట్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ ఫీటును సాధించిన మహేంద్ర సింగ్ ధోని కరోనా వేళ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. ధోని మహాభిష్క్రమణ అందరినీ షాక్ కు గురిచేసింది. చివరి మ్యాచ్ ఆడకుండా.. అందరితో పొగిడించుకోకుండా.. సన్మానించకుండా ధోని ఇలా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే ధోనిని సగర్వంగా సాగనంపాలని తాజాగా జార్ఖండ్ సీఎం సోరేన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలని కోరాడు.

    Also Read: ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

    సమకాలీన క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మించిన సమర్థవంతమైన కెప్టెన్.. ఫినిషర్ లేరని దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు.. మ్యాచ్ లో ధోని ఉన్నాడంటే అతడి వ్యూహాలు.. ఆట భారత్ ను గెలిపిస్తుందని ఎంతో మంది దిగ్గజాలు కూడా మెచ్చుకున్నారు. ప్రపంచంలోనే ధోనినే ఇప్పటిదాకా బెస్ట్ ఫినిషర్ అని దిగ్గజ క్రికెటర్లంతా స్పష్టం చేస్తున్నారు. అయితే కరోనా ప్రబలడం.. ఇప్పట్లో క్రికెట్ మొదలయ్యే సూచనలు లేకపోవడంతో ఎంఎస్ ధోని.. ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికాడని అందరూ అనుకున్నారు.. కానీ ధోని రిటైర్ మెంట్ వెనుక ఒక పెద్ద శక్తి ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    ధోని ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ప్రస్తుతం చెన్నైలో క్యాంప్ లో ఉన్నారు. సడన్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో మెమొరీస్ వీడియోను పోస్ట్ చేసి తాను ఈ సాయంత్రం 7.29 గంటల నుంచి రిటైర్ అవుతున్నట్లు అందరూ గమనించాలని కోరారు. ‘కెరీర్ లో సాంతం నన్ను ప్రేమించి.. మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.. 19.29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని వీడియోను ఎంఎస్ ధోని పోస్టు చేశాడు.

    గత ఏడాది ప్రపంచకప్ లో న్యూజిలాండ్ లో సెమీఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యి అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్నాడు.ఇక నుంచి ఐపీఎల్ లో మాత్రమే ధోని కొనసాగుతాడు. 2007 టీ20 ప్రపంచకప్ తోపాటుగా 2011 వన్డే ప్రపంచకప్, అలాగే చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాడు. టెస్టులలో ఇండియాను నంబర్ 1గా నిలిపాడు. భారత క్రికెట్ లోనే తిరుగులేని విజయాలను అందించిన గొప్ప కెప్టెన్ గా ధోని రికార్డుల్లో నిలిచారు.

    Also Read: కరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?

    అయితే ధోని రిటైర్ మెంట్ వెనుకున్నది ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే గంగూలీ సహా ద్రావిడ్, లక్ష్మణ్ లను ఇదే ధోని కెప్టెన్ అయ్యాక సాగనంపాడు. వారిని తీసేసి యువతకు అవకాశం ఇచ్చి వారిని రిటైర్ అయ్యేలా చేశాడు. ధోని హయాంలోనే గంగూలీ కూడా తొలగించబడ్డాడు. 2007 ప్రపంచకప్ లో టీమిండియా దారుణ ఓటమి తర్వాత ధోని కెప్టెన్ కావడం.. గంగూలీ అవమానకరమైన రీతిలో జట్టులో చోటు కోల్పోయాడు. అందుకే ఇప్పుడు బీసీసీఐ చీఫ్ అయిన గంగూలీ ధోనిపై పగబట్టారని అంటున్నారు.

    ధోనిని మళ్లీ జట్టులోకి రాకుండా గంగూలీ అడ్డుకుంటున్నాడని.. అతడికి ద్వారాలు క్లోజ్ చేశాడని అంటున్నారు. జట్టులో చోటు ఇవ్వవద్దని గంగూలీ పంతం పట్టాడని.. వరుసగా విఫలమైన ధోనిని పక్కనపెట్టాలని యోచిస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

    అందుకే గంగూలీ తీసివేయకముందే తనే గౌరవంగా తప్పుకోవాలని ఇలా ధోని సడన్ గా రిటైర్ మెంట్ ప్రకటించాడని తెలుస్తోంది.

    -నరేశ్ ఎన్నం