అడవిలో కేక్ కట్టింగ్.. కోతి ఏం చేసిందంటే?

సాధారణంగా కోతులు చేసే అల్లరి అంతాఇంతా కాదు. కోతుల అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక కోతి బర్త్ డే బాయ్ కు చుక్కలు చూపించింది. ఒక వ్యక్తి స్నేహితులతో కలిగి సరదాగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని భావించగా అక్కడ ఉన్న కోతి బర్త్ డే బాయ్ ఆశలను అడియాశలు చేసింది. తన కోతిచేష్టలతో చేసిన వింత పని వల్ల అవాక్కవ్వడం బర్త్ డే బాయ్ వంతయింది. ఒక […]

Written By: Navya, Updated On : August 16, 2020 12:23 pm
Follow us on

సాధారణంగా కోతులు చేసే అల్లరి అంతాఇంతా కాదు. కోతుల అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక కోతి బర్త్ డే బాయ్ కు చుక్కలు చూపించింది. ఒక వ్యక్తి స్నేహితులతో కలిగి సరదాగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని భావించగా అక్కడ ఉన్న కోతి బర్త్ డే బాయ్ ఆశలను అడియాశలు చేసింది. తన కోతిచేష్టలతో చేసిన వింత పని వల్ల అవాక్కవ్వడం బర్త్ డే బాయ్ వంతయింది.

ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి అడవిలో పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావించాడు. కేక్ తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక మంచి స్థలం వెతుక్కుని కేక్ ను కట్ చేయడం ప్రారంభించాడు. అతని స్నేహితులు హ్యాపీ బర్త్ డే అంటూ పాట పాడుతూ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఎక్కడినుంచో వచ్ఛిన కోతి కేక్ తీసుకుని పరుగులు తీస్తూ చెట్టెక్కేసింది. దీంతో అవాక్కవ్వడం బర్త్ డే బాయ్ వంతయింది.

కోతి కేకును ఎత్తుకెళ్లడం చూసి యువకులు తెల్లమొహాలు వేశారు. ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని భావిస్తే ఆ ఆశలపై కోతి నీళ్లు జల్లిందని అభిప్రాయపడ్డారు. బర్త్ డే తతంగాన్ని షూట్ చేస్తున్న వాళ్లకు కేకు దక్కకపోయినా వీడియో మాత్రం మిగిలింది. కోతి కేకును ఎత్తుకెళ్లిపోయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కోతి తెలివిని ప్రశంసిస్తూ బర్త్ డే బాయ్ పట్ల జాలి చూపించారు.