Vishwakarma Scheme: ఉచిత టూల్‌ కిట్‌ స్కీమ్‌కు మళ్లీ ఛాన్స్‌.. కేంద్ర పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ యోజన కింద చేతితో లేదా పనిముట్లతో సంప్రదాయ పనులు చేసేవారికే కేంద్రం టూల్‌కిట్‌ ఇస్తుంది. ఐతే ఈ టూల్‌కిట్‌ను కేంద్రం నేరుగా ఇవ్వదు. దానిని కొనుగోలు చేయడానికి రూ.15 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఉలితో శిల్పాలు చెక్కేవారు రూ.15 వేలతో ఉలి, సుత్తి, ఇతర పనిముట్లు కొనుగోలు చేయవచ్చు.

Written By: Raj Shekar, Updated On : July 8, 2024 4:41 pm

How to apply for PM Vishwakarma Tool Kit

Follow us on

Vishwakarma Scheme: చేతి వృత్తులు, పనిముట్ల సాయంతో పనిచేసే సంప్రదాయ కళాకారులను గుర్తించి వారికి టూల్‌ కిట్‌తోపాటు ఉపాధికి రుణసాయం అందించేందుకు కేంద్రం పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించింది. ఈ పథకంలో ఉచిత టూల్‌ కిట్‌ ఇచ్చేందుకు దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియను కేంద్రం నిలిపివేసింది. తాజాగా మళ్లీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.15 వేలు ఖతాలు జమ చేస్తుంది. వీటితో టూల్‌కిట్‌ కొనుగోలు చేయవచ్చు.

నేరుగా ఇవ్వదు..
పీఎం విశ్వకర్మ యోజన కింద చేతితో లేదా పనిముట్లతో సంప్రదాయ పనులు చేసేవారికే కేంద్రం టూల్‌కిట్‌ ఇస్తుంది. ఐతే ఈ టూల్‌కిట్‌ను కేంద్రం నేరుగా ఇవ్వదు. దానిని కొనుగోలు చేయడానికి రూ.15 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఉలితో శిల్పాలు చెక్కేవారు రూ.15 వేలతో ఉలి, సుత్తి, ఇతర పనిముట్లు కొనుగోలు చేయవచ్చు. దర్జీలు కుట్టు మిషన్‌ కొనుక్కోవచ్చు.

18 రకాల టూల్‌ కిట్లు..
పీఎం విశ్వకర్మ కింద కేంద్రం 18 రకాల వృత్తులు చేసేవారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18 రకాల హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి టూల్‌ కిట్లు ఇస్తోంది. ఈ క్రమంలో టూల్‌ కిట్‌కు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కార్పెంటర్, పడవ తయారీదారు, బంగారు నగల తయారీదారులు, నిర్మాణ కార్మికులు, లోహ కళాకారులు, సుత్తి తయారీదారులు, టూల్‌ కిట్ల తయారీదారులు, విగ్రహాల తయారీదారులు, రాళ్లు పగులగొట్టేవారు,కుమ్మరి, చెప్పుల తయారీదారు, దుప్పల్టు, పరుపులు, చాపల తయారీదారు, బొమ్మల తయారీదారు, కొబ్బరిపీచుతో తాళ్లు తయారు చేసేవాళ్లు, బార్బర్, పూలదండల తయారీదారు, బట్టలు ఉతికేవారు, టైలర్లు, చేపల వలలు తయారు చేసేవారికి కేంద్రం టూల్‌ కిట్స్‌ ఇస్తుంది.