Manchu Manoj: మీరు రింగ్ మాస్టర్ అంటూ ఆర్జివికి కౌంటర్ ఇచ్చిన… మంచు మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ తనదైన శైలిలో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న యంగ్ హీరో. మనోజ్ కేవలం సినిమాల  పరంగానే కాకుండా … సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. సినీ పరిశ్రమలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఏమైనా జరిగితే తప్పకుండా వెళ్లి పరామర్శించి వ్యక్తుల్లో మంచు మనోజ్ ఒకరు. ఇటీవలే జరిగిన ‘మా ‘ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో  మంచి హాట్ టాపిక్ గా జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు […]

Written By: Raghava Rao Gara, Updated On : October 19, 2021 4:29 pm
Follow us on

Manchu Manoj: మంచు మనోజ్ తనదైన శైలిలో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న యంగ్ హీరో. మనోజ్ కేవలం సినిమాల  పరంగానే కాకుండా … సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. సినీ పరిశ్రమలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఏమైనా జరిగితే తప్పకుండా వెళ్లి పరామర్శించి వ్యక్తుల్లో మంచు మనోజ్ ఒకరు. ఇటీవలే జరిగిన ‘మా ‘ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో  మంచి హాట్ టాపిక్ గా జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ‘మా’ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ‘మా’ ఎన్నికల మీద రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ హాట్ టాపిక్ గా మారింది. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, సభ్యులంతా జోకర్లు అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కు స్పందిస్తూ  మంచు మనోజ్ వినూత్న రీతిలో కౌంటర్ ఇచ్చాడు.   “సార్, మీరు రింగ్ మాస్టర్” అంటూ సెటైరికల్ గా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో  వైరల్  అవుతుంది.

https://twitter.com/HeroManoj1/status/1450332998084165634?s=20

మా ఎన్నికల సమయంలో మంచు మనోజ్…  ప్రకాష్ రాజ్, విష్ణు కలిసి దిగిన సెల్ఫి కి వెరైటీ గా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. మా ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు అలాగే మంచు విష్ణు ప్యానెల్ సభ్యులకు సర్దిచెప్పడంలో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. మంచు మనోజ్ లేకపోతే మా ఎన్నికల పోలింగ్ సమయంలో గొడవలు పడే వారని, పరిస్థితి దారుణంగా ఉండేదని, అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు బహిరంగగానే చెప్పడం అందరికీ తెలిసిందే.