https://oktelugu.com/

Jai Bhim Movie: సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్ రిలీజ్ … సోషల్ మీడియాలో వైరల్

Jai Bhim Movie: తమిళ, తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చాలా కాలం తర్వత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. సుధా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 19, 2021 / 04:35 PM IST
    Follow us on

    Jai Bhim Movie: తమిళ, తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చాలా కాలం తర్వత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. సుధా కొంగరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది.

    ఈ సినిమాలో సూర్య కెప్టెన్ గోపినాధ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో సూర్య నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమా తర్వాత ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అప్పట్లో ఆ యువతి కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూర్య అభిమానులు.
    ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘పవర్’ అంటూ సాగే ఒక పాటను వదిలారు చిత్రయూనిట్. సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. సీన్ రోల్డన్ కంపోజ్ చేసిన ఈ పాటకి అరివు సాహిత్యాన్ని అందించడమే కాకుండా తానే ఆలపించాడు. ఈ పాట పై మీరు ఓ లుక్కేయండి.