Mogali Rekulu Actor: భార్య ముందే వేరే అమ్మాయిలతో రాసలీలలు చేస్తున్న మొగలి రేకులు నటుడు…

Mogali Rekulu Actor: ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటున్నాడు మొగలి రేకులు ఫేమ్ దయా అలియాస్ పవిత్ర నాథ్. ఆయన గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చు… కానీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే మొగలి రేకులు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితుడు అనే చెప్పాలి. జాతకాలు కూడా చెప్తూ ఉండే పవిత్ర నాధ్ గత కొన్ని సంవత్సరాలుగా జాతకాల పేరుతో కొంత మంది అమ్మాయిలను తీసుకొచే వాడని తెలిపింది. తన కళ్ల ముందే చేయకూడని […]

Written By: Raghava Rao Gara, Updated On : October 19, 2021 4:11 pm
Follow us on

Mogali Rekulu Actor: ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటున్నాడు మొగలి రేకులు ఫేమ్ దయా అలియాస్ పవిత్ర నాథ్. ఆయన గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చు… కానీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే మొగలి రేకులు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితుడు అనే చెప్పాలి. జాతకాలు కూడా చెప్తూ ఉండే పవిత్ర నాధ్ గత కొన్ని సంవత్సరాలుగా జాతకాల పేరుతో కొంత మంది అమ్మాయిలను తీసుకొచే వాడని తెలిపింది. తన కళ్ల ముందే చేయకూడని పనులు చేస్తున్నాడని కన్నీటి పర్యంతం అయ్యింది. 11 ఏళ్లుగా ఆ బాధను భరిస్తున్నానని… తన బిడ్డలకు న్యాయం చేయమంటూ కోర్టు మెట్టులెక్కింది శశిరేఖ.

2009 సంవత్సరంలో వీరిద్దరికి వివాహం జరగగా పెళ్లైన కొన్నేళ్ల వరకు అంతా బాగానే ఉన్నాదాని ఆమె చెప్పింది. అయితే ఆమె గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆమె ముఖం చూస్తూనే చిరాకు పడేవాడని వాపోయింది. పెళ్లైనా యేడాదికే గర్భవతిని అని తెలిసిన కూడా అత్తామామలు ఇంటి నుంచి గెంటేస్తే … తన నగలు అమ్మి మరి మణికొండలో ఇళ్లు కొన్నానని వివరించింది. ఈ దంపతులకు 11 ఏళ్ల పాప, 8 యేళ్ల బాబు ఉన్నారు. పెళ్లైనా అతనికి అమ్మాయిల మోజు తీరలేదని … తెల్లవార్లు అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తూ… వాళ్లను ఇంటికి పిలిపించుకొని తన ముందే రూమ్ లోపలికి తీసుకెళ్ళేవాడని అంటుంది. ఇదేమిటని నేను ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టే వాడని … అత్తామామలు కూడా ఎప్పుడూ సపోర్ట్ చేయలేదని అంటుంది. ఎలా అయిన ఆమెకు న్యాయం చేయాలని కోరుతుంది శశిరేఖ. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.