
Lakshmi Manchu: అతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మంచు లక్ష్మి ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎంతగా ట్రోల్ కి గురవుతున్నా తమ పంథా మార్చుకోరు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి తమ అసందర్భ వ్యాఖ్యలతో విమర్శలకు గురవుతూ ఉంటారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మిని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి జరగాలి అంటూ కామెంట్ చేశారు. ఫోటో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మంచు లక్ష్మిని సుమంత్ కౌగిలించుకొని ఉండగా… ఆమె స్మైల్ ఇచ్చారు.
ఒక మ్యారీడ్ ఉమన్ పరాయి వ్యక్తితో అలా సన్నిహితంగా ఉండటాన్ని జనాలు తప్పుబడుతున్నారు. సుమంత్ నీకు ఫ్రెండ్ కావచ్చు లేదా కజిన్ ఫీలింగ్ ఉండొచ్చు. పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఆయన్ని కౌగిలించుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు. పద్ధతి, డిసిప్లైన్ అనే చెప్పే మీ తండ్రి మోహన్ బాబు పెంపకం ఇదేనా అంటూ ఏకిపారేస్తున్నారు. కొందరైతే రాయలేని భాషలో తప్పుడు, బూతు కామెంట్స్ చేస్తున్నారు.
ఆ ఫొటోలో తప్పుబట్టాల్సినంత మేటర్ లేకపోయినప్పటికీ పరిస్థితులు, ప్రాంతాన్ని బట్టి నడుచుకోవాలి. మన ఇండియన్ సొసైటీలో బ్రదర్ ని హగ్ చేసుకున్నా కొందరు హర్షించరు. వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చేయాలి అనుకుంటారు. మంచు లక్ష్మి ఏకంగా సుమంత్ ని కౌగిలించుకొని ఫోటో దిగింది. డార్లింగ్ అంటూ రొమాంటిక్ పదం వాడింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలు మంచు లక్ష్మి అసలు పట్టించుకోరు. చూసి చూసి అలవాటైపోయింది ఆమెకు.

తనపై వచ్చే ట్రోల్స్ ని మంచు లక్ష్మి పిచ్చ లైట్ తీసుకుంటారు. ఇతరులను పట్టించుకుంటే మనం ఏం చేయలేము. అవన్నీ పనీ పాట లేనోళ్ళు చేసే విమర్శలని అంటారు. మోహన్ బాబు నటవారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. అయితే ఆమెకు లక్ కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇది సొంత బ్యానర్ లో తెరకెక్కుతుంది. అలాగే ఇతర హీరోల చిత్రాల్లో ఆడపాదడపా పాత్రలు చేస్తున్నారు.
Wishing the darling @iSumanth a great year ahead!
Happy Birthday ♥️ #HBDSumanth #HappyBirthdaySumanth pic.twitter.com/fYNQFu3pT6— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 9, 2023