
Amigos Movie Review: నటీనటులు : కళ్యాణ్ రామ్ , ఆషిక రంగనాథ్ , బ్రహ్మాజీ, జయప్రకాశ్ , కళ్యాణి నటరాజన్
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నినేని, రవి శంకర్
డైరెక్టర్ : రాజేందర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : గిబ్రాన్
టాలీవుడ్ లో మాస్ మసాలా సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలను మాత్రమే కాదు,సరికొత్త కథలను నచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా ఎక్కువ..అలాంటి ఆడియన్స్ కి కళ్యాణ్ రామ్ కూడా ఒక మంచి ఛాయస్ అయ్యాడు.తన ప్రతీ సినిమా కొత్తరకం గా ఉండేలాగా చూసుకుంటూ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు..అలాంటి ప్రయత్నాలలో ఆయనకీ ఎక్కువగా ఎదురు దెబ్బలే తగిలాయి.ఆలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో శతమతవుతున్న కళ్యాణ్ రామ్ కి గత ఏడాది ‘భింబిసారా’ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.ఈ చిత్రం ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అంత పెద్ద హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ ‘అమిగోస్’ అనే మరో డిఫరెంట్ సబ్జెక్టు తో ఈరోజు మన ముందుకి వచ్చాడు..మరి ఈ సినిమాతో ఆయన అభిమానులు మరియు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేదో చూద్దాం.
కథ :
ఈ చిత్రం లో కళ్యాణ్ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ గా మైఖేల్, సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా మంజునాథ్ మరియు బిజినెస్ మ్యాన్ గా సిద్దార్థ్.కొన్ని అనుకోని సంఘటనల కారణం గా ఈ ముగ్గురు కలుసుకుంటారు.ఒక పక్క CIA మైఖేల్ ని పట్టుకునేందుకు వెతుకుతూ ఉంటుంది..ఎందుకంటే అతను ఒక పెద్ద నేరస్తుడు, ఎన్నో హత్యలు చేసి ఉంటాడు.CIA నుండి తప్పించుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న మైఖేల్ కి తన రూపం లో అచ్చుగుద్దినట్టు ఉన్న మంజునాథ్ , సిద్దార్థ్ కలవడం తో వాళ్ళని వాడుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు..ఈ ప్రయత్నం లో మైఖేల్ సక్సెస్ సాధిస్తాడా?,మైఖేల్ కి సిద్దార్థ్ మరియు మంజునాథ్ తో రక్తసంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
సాధారణం గా ఇలాంటి కథలను ప్రేక్షకులకు అర్థం అయ్యేట్టు చూపించడం అనేది కత్తి మీద ఆమె లాంటిది, కానీ డైరెక్టర్ రెజేందర్ రెడ్డి తన టేకింగ్ తో ఆడియన్స్ బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా, అందరికీ అర్థం అయ్యేటట్టు చాలా చక్కగా తీసాడు.మొదటి సినిమాతోనే ఇంత కష్టతరమైన సబ్జెక్టు ని డీల్ చేసినందుకు అతనిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కళ్యాణ్ రామ్ పోషించిన మూడు పాత్రలను డెవలప్ చెయ్యడానికే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.కానీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు, ప్రేక్షకులు ఆసక్తికరంగా తర్వాత ఏమి జరుగుతుంది అనే ఫీలింగ్ తో చూసేలా చేసాడు, సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే మెయిన్ ప్లాట్ లో అడుగుపెట్టి చివరి నిమిషం వరకు ఆడియన్స్ లో టెన్షన్ క్రియేట్ అయ్యే స్క్రీన్ ప్లే తో కథని నడిపించడం లో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ రాజేందర్ రెడ్డి.

ఇక కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుకోవాలి..ప్రతీ సినిమాలోనూ తనలోని కొత్తకోణాన్ని ఆడియన్స్ కి పరిచయం చెయ్యాలని పరితపిస్తూ ఉంటాడు..ఈ సినిమాలో కూడా అదే చేసాడు, మూడు భిన్నమైన పాత్రలు చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు, కానీ కళ్యాణ్ రామ్ చాలా అలవోకగా ఆ మూడు పాత్రల్లో నటించి శబాష్ అనిపించుకున్నాడు.ముఖ్యంగా ఈ చిత్రం లో ఆయన పోషించిన ‘మైఖేల్’ పాత్ర ఆయన కెరీర్ బెస్ట్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోతుంది.ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ తన పరిధికి తగట్టుగా పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది.ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు వస్తాయి గాని’ అనే సాంగ్ లో ఆమె ఎంతో అందం గా కనిపించింది..ఇక గిబ్రాన్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ పర్వాలేదని అనిపించింది.మైత్రి మూవీ మేకర్స్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి పెద్ద ఆకర్షణ.
చివరి మాట: కొత్త తరహా సినిమాలను చూడాలనుకునే వారికి అమిగోస్ చిత్రం తెగ నచ్చేస్తుంది..కథలో ఎక్కడ తికమక లేకుండా, చూసే ప్రతీ ప్రేక్షకుడికి నచ్చే విధంగా డైరెక్టర్ ఈ సినిమాని తీర్చి దిద్దిన తీరు బాగుంది.ఫైనల్ గా ఈ వీకెండ్ కి ఒక మంచి సినిమా మీ ముందుకి వచ్చింది, చూసి ఎంజాయ్ చెయ్యండి.
రేటింగ్ : 2.75/5