Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: మోహన్​లాల్​ సినిమాతో మలయాళంలోకి మంచు లక్ష్మి ఎంట్రీ!

Manchu Lakshmi: మోహన్​లాల్​ సినిమాతో మలయాళంలోకి మంచు లక్ష్మి ఎంట్రీ!

Manchu Lakshmi: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కర్​: అరబికడలింటే సింహమ్‌. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబరు 2న ఈ సినిమా అన్ని థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మరోవైపు, మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా మాన్​స్టార్​.

Manchu Lakshmi

అయితే, ఈ సినిమాలో టాలీవుడ్​ సీనియర్​ నటుడు మంచు మోహన్​ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంచు లక్ష్మీ మలయాళం ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమా థ్రిల్లర్​ కథాంశంతో తెరకెక్కనుంది. ఇందులో లక్ష్మీ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్​.

ఈ థ్రిల్లర్ కథను వినగానే.. మంచు లక్ష్మీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వైశాఖ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మోహన్​హాల్​కు సంబంధించిన ఫస్ట్​లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఇందులో మోహన్​లాల‌్​ లక్కీ సింగ్ అనే పంజాబీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించనున్నారు. ఫస్ట్​ లుక్​లో కూడా మోహన్​లాల్​ పంజాబీ స్టైల్​లోనే కనిపించారు.

గతంలో మన్యం పులి, లూసీఫర్​, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్​లాల్​. ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మోహన్​లాల్​ తెలుగులోనూ కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు.  ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version