Visakhapatnam News: ప్రేమోన్మాదం పక్కదారి పడుతోంది. ప్రేమించిన వారి కోసం గుళ్లు కట్టే సంస్కృతి మనది అయినా కొద్ది కాలంగా ప్రేమించిన వారి పట్ట కర్కశం పెరిగిపోతోంది. ఫలితంగా ప్రాణాల మీదకు వస్తోంది. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో కత్తులతో దాడి చేయడం, పెట్రోల్ పోసి నిప్పంటించడం, యాసిడ్ దాడులు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. ప్రేమించిన వారి కోసం త్యాగం చేయాల్సిన వారే అడ్డదారిలో వారి ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా నూరేళ్లు బతకాల్సిన వారి జీవితాలను ఆదిలోన చిదిమేస్తున్నారు.

విశాఖ(Visakhapatnam News) నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన వల్లభదాసు ప్రత్యూష (20) పంజాబ్ లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ (21) చదువుతున్నాడు. కొద్ది కాలంగా ప్రత్యూష వెంటపడుతూ ప్రేమించాలని వెంటపడుతున్నాడు. దీంతో ఆమె నిరాకరిస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యూషతో మాట్లాడదామని చెప్పి నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ తనను ప్రేమించాలని వేధించాడు. తను నిరాకరించింది. అయినా చెప్పిన మాట వినడం లేదని వెంట తెచ్చుకున్న పెట్రో ల్ ను ప్రత్యూషపై పోసి నిప్పటించాడు. తరువాత తను కూడా అంటించుకున్నాడు. గదినుంచి అరుపులు వినిపించడంతో హోటల్ సిబ్బంది వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు.
అప్పటికే ఇద్దరి శరీరాలు సగానికంటే ఎక్కువ కాలిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని హార్బర్ ఏసీపీ శిరీష సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల నుంచి మెజిస్రేట్ వాంగ్మూలం రికార్డు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రావు పేర్కొన్నారు.
Also Read: అమ్మాయి సిగ్నల్స్ ను బట్టి ఆమె ఆలోచన ఇలా తెలుసుకోవచ్చు
డేటింగ్.. వన్ నైట్ స్టాండ్.. తేడా ఏంటి..? ఏదీ బెటర్..? దేంట్లో నష్టం ఎక్కువ..?