Ghani movie: మాయాగా శాయి మంజ్రేకర్​ కొత్త ​ లుక్​.. గని న్యూ అప్​డేట్​!

Ghani movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్​ 2” సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఆ చిత్రం కూడా మంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 1:15 pm
Follow us on

Ghani movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్​ 2” సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​.

ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ “గని” సినిమాలో నటిస్తున్న విశయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో శాయి మంజ్రేకర్​ హీరోయిన్​గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మంజ్రేకర్​ పాత్రకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాయా అనే పాత్రలో కనిపించనుంది ఈ భామ. ప్రస్తుతం ఈ పోస్ట్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

బాక్సింగ్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు బాబీ, రినైసాన్స్ పిక్చ‌ర్స్  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి తో 0పాటు న‌వీన్ చంద్ర ఈ సినిమాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.  డిసెంబరు 3న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమలోనే ప్రమోషన్స్​లో భాగంగా రోజుకో కొత్త అప్​డేట్ విడుదల చేస్తున్నారు మేకర్స్​.