https://oktelugu.com/

Lakshmi Manchu: అయ్యో మంచు లక్ష్మి కి ఏమైంది? అది వికటించిందా? సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్!

మంచు లక్ష్మి చేసిన ఓ పొరపాటు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ మేరకు ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపుతోంది. ముఖానికి ప్లాస్టర్స్ తో కనిపిస్తున్న మంచు లక్ష్మి ఫోటో వైరల్ అవుతుంది, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏమైందో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 26, 2024 / 05:35 PM IST

    Lakshmi Manchu

    Follow us on

    Lakshmi Manchu: మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనకు సంబంధించిన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు ఆమె అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో తన ఫోటో పెట్టింది. సదరు ఫోటోలో మంచు లక్ష్మి పెదాలకు, ముఖానికి ప్లాస్టర్స్ అతికించి ఉన్నాయి. దాంతో అభిమానులు కంగారు పడ్డారు. ఆమెకు ఏమైందనే ఆందోళన చెందుతున్నారు. మరొక పోస్ట్ లో మంచు లక్ష్మి వివరణ ఇచ్చింది. ఆమె చేసిన ఓ పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చింది.

    మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను పెట్టిన ఫోటో చూశారు కదా.. ఇప్పుడు ఇలా ఉన్నాను. దీనికి కారణం ఏమిటంటే… అందరూ తమ శరీరం ఏది తీసుకోగలుగుతుందో? ఏది తీసుకోలేదో? ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను మోతాదుకు మించి రెండు సాధారణ టాబ్లట్స్ తీసుకున్నాను. వెంటనే నిమిషాల వ్యవధిలో నా పెదవి అలర్జీ కారణంగా పగిలిపోయింది. లక్కీగా ఆ సమయంలో డాక్టర్ అయిన నా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు. అలర్జీని కంట్రోల్ చేసే టాబ్లెట్స్ ఇచ్చాడు. లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేది. అరచేతి మీద ఒక బంప్ లా వచ్చింది.

    దీన్ని ఐసోలేటెడ్ డ్రగ్ అలర్జీ అంటారు. అలర్జీ తగ్గడానికి స్టిరాయిడ్స్ తీసుకున్నాను. అందు వలన అలర్జీ టెస్ట్ చేయలేకపోతున్నాము, అని అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ… నేను ఈ వీడియో చేయడానికి కారణం.. మనం ఏదో చిన్న ప్రాబ్లం కి తీసుకునే టాబ్లెట్ పడకపోతే అలర్జీకి గురవుతాము. దాని వలన ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ శరీరానికి ఏది పడుతుంది, ఏది పడదో పరీక్షలు చేయించుకోండి. నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను. త్వరలో కోలుకుంటాను.. అని చెప్పుకొచ్చింది.

    అదన్నమాట సంగతి. రెండు టాబ్లెట్స్ మంచు లక్ష్మిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. అదృష్టవశాత్తు చిన్న సమస్యతో ఆమె బయటబడ్డారు. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. కెరీర్ కోసం హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ముంబై వెళ్ళాక మంచు లక్ష్మి గ్లామర్ షో చేయడం ఎక్కువైంది. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో అమ్మడు మైండ్ బ్లాక్ చేస్తుంది.

    మోహన్ బాబు నటవారసుల్లో ఒకరైన మంచు లక్ష్మి టెలివిజన్ హోస్ట్ కూడాను. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించింది. మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతున్నాయనే వాదన ఉంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు మనోజ్, మంచు లక్ష్మి మరొకవైపు ఉన్నారు. ఆస్తుల పంపకాలు మనస్పర్థలకు కారణం అని సోషల్ మీడియా టాక్.