https://oktelugu.com/

Tamannaah Bhatia: అక్షరాలా 1400 కోట్ల రూపాయిలు..హీరోలకు కూడా సాధ్యం అవ్వని రికార్డుని నెలకొల్పిన తమన్నా!

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన 'ఆర్నామలై 4' కూడా కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 26, 2024 / 05:30 PM IST

    amannaah Bhatia

    Follow us on

    Tamannaah Bhatia: ఒక హీరోయిన్ దశాబ్దకాలం వరకు ఇప్పుడు ఉన్న పోటీ వాతావరణంలో కొనసాగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒకటి రెండు ఫ్లాప్స్ పడగానే దర్శక నిర్మాతలు అప్పటి వరకు ఉన్న టాప్ హీరోయిన్స్ ని పక్కన పెట్టి, కొత్త హీరోయిన్స్ కోసం చూస్తున్నారు. కానీ హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా, ఒకప్పుడు ఎలాంటి డిమాండ్ ఉండేదో, ఇప్పటికీ అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న హీరోయిన్లు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఆ తక్కువమందిలో ఒకరు తమన్నా. ఈమె తొలుత హిందీ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు లో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అలాంటి సమయంలో ఆమెకి తమిళం లో ‘కేడి’ అనే చిత్రంలో విలన్ రోల్ చేసే అవకాశం దక్కింది. ఇందులో 7/జి బృందావన కాలనీ ఫేమ్ రవికృష్ణ, ఇలియానా హీరోహీరోయిన్లు గా నటించారు. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ, నెగటివ్ రోల్ చేసిన తమన్నా కి మంచి పేరు వచ్చింది.

    ఆ తర్వాత ఈమెకి అవకాశాలు క్యూ కట్టాయి, తెలుగులో ఆమె నటించిన ‘హ్యాపీ డేస్’ చిత్రం మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కేవలం అందం, నటనతోనే మాత్రమే కాదు, తమన్నా తన డ్యాన్స్ తో కూడా ప్రేక్షకులను మైమరచిపోయేలా చేయగలదు. అయితే మధ్యలో తమన్నా కి కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల ఆమెని ఐరన్ లెగ్ అని పిలిచేవారు. కానీ రీసెంట్ గా తమన్నా చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు సంచలనంగా మారాయి. గత ఏడాది ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం లో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఆర్నామలై 4’ కూడా కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రెండు చిత్రాల తర్వాత రీసెంట్ గా ఆమె ‘స్త్రీ2’ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను సాదిస్తూ ముందుకు పోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది. ఇలా కేవలం మూడు సినిమాలకు కలిపే 1400 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. వీటితో పాటుగా ఆమె నటించిన అడల్ట్ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె సంపాతి నంది దర్శకత్వం లో ఓదెల 2 అనే చిత్రం లో నటిస్తుంది.