https://oktelugu.com/

Manchu Lakshmi: లేటు వయసులో ఘాటైన ఫోజులు…మొహమాటం వదిలేసిన మంచు లక్ష్మి! లేటెస్ట్ లుక్ వైరల్

మంచు లక్ష్మి విలన్ రోల్ చేసింది. అనగనగా ఓ ధీరుడు భారీ డిజాస్టర్ గా నిలిచింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించాడు. అనంతరం గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 23, 2024 / 12:41 PM IST
    Follow us on

    Manchu Lakshmi: మంచు వారి అమ్మాయికి కాలం కలిసి రాలేదు కానీ.. సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాల్సింది. వయసు మీద పడ్డాక ఆమె హీరోయిన్ కావాలనే కలలు కన్నారు. యంగ్ ఏజ్ లో మంచు లక్ష్మి అమెరికాలో సెటిల్ అయ్యింది. అక్కడ హోస్ట్ గా టెలివిజన్ షోలు చేసింది. ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. సడన్ గా అమెరికాకు గుడ్ బై చెప్పి ఇండియాలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె మొదటి సినిమా… అనగనగా ఓ ధీరుడు. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్.

    మంచు లక్ష్మి విలన్ రోల్ చేసింది. అనగనగా ఓ ధీరుడు భారీ డిజాస్టర్ గా నిలిచింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించాడు. అనంతరం గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. బ్రేక్ మాత్రం రాలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ కాలేదు. అసలు మంచు లక్ష్మి అంటే చెప్పుకోవడానికి ఒక ఇమేజ్ లేదు. నటిగా, టెలివిజన్ హోస్ట్ గా, నిర్మాతగా ఆమె పలు రంగాల్లో రాణించే ప్రయత్నం చేసింది.

    పరిశ్రమలో ఆమెకంటూ గొప్ప పరిచయాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, సమంతలకు మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్. అందుకే ముంబై కి మకాం మార్చింది. అక్కడ ఓ ఖరీదైన ఇంట్లో ఉంటుంది. బాలీవుడ్ లో ఎదగాలని అక్కడకు వెళ్లినట్లు చెబుతుంది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి తెలుగులోనే ఆమె సత్తా చాటలేదు. బాలీవుడ్ లో ఏం చేయగలరనే వాదన ఉంది.

    అయితే విమర్శలు, నెగిటివ్ కామెంట్స్ మంచు లక్ష్మి పట్టించుకోదు. ఆమెకు నచ్చిన పని చేసుకుంటూ పోతుంది. ఈ మధ్య ప్రొఫెషనల్ మోడల్ రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో మనసులు దోచేసింది. మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది మంచు లక్ష్మి చిన్న తమ్ముడు మంచు మనోజ్ కి రెండో వివాహం జరిపించింది. ఈ పెళ్ళికి విష్ణు రాలేదు. మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే…