Manchu Lakshmi: మంచు ఫ్యామిలీకి ఇది సంబరాల సమయం. ఎన్నో శక్తులను దాటుకుని, ఎందరో వ్యక్తులను అడ్డుకుని ఆ కుటుంబం మా పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ముఖ్యంగా మోహన్ బాబుకి నటీనటులలో గౌరవం ఉందని మా ఎన్నికలతో రుజువు అయిపోయింది. ఇక ఈ శుభపరిణామంలో మంచు లక్ష్మి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సహజంగా సినిమాల ఎంపిక విషయంలో మంచు లక్ష్మి చాలా సెలక్టివ్ గా ఉంటుంది.

ముఖ్యంగా కథలు, పాత్రల ఎంపికలో ఆమె కాస్త కఠినంగా ఉంటుంది. కేవలం పారితోషికం కోసం సినిమాలు చేయదు, సినిమాల ద్వారా తను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పింది. అయితే, మంచు లక్ష్మి ఇష్టపడి చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.
అయితే, మంచి పాత్రలను మంచి కథలను ఎంచుకుంది అనే పేరు అయితే లక్ష్మికి దక్కింది. తాజాగా ఓ సినిమాకు సైలెంట్ గా ఓకే చెప్పి సైన్ చేసింది లక్ష్మి. ఇదొక ఆంథాలజీ సినిమా. మొత్తం నాలుగు కథల సమ్మేళనంగా ఈ చిత్రం ఉండబోతుంది. ప్రతి కథలో మంచు లక్ష్మినే మెయిన్ లీడ్, అన్నట్టు ఈ వెబ్ ఫిల్మ్ ను జీ5 కోసం నిర్మించబోతున్నారు.
ఇక ఈ నాలుగు కథల్లో నాలుగు గెటప్స్ లో నటించడానికి అంగీకరించి మంచు లక్ష్మి డేరింగ్ స్టెప్ తీసుకుంది. ఆమె నటన హైలెట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది అంటున్నారు. అయితే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే నెల 4వ తేదీన దీపావళి స్పెషల్ గా ఈ సినిమాని ఎనౌన్స్ చేయాలని లక్ష్మి ప్లాన్ చేస్తోంది.
నటిగా వ్యాఖ్యాతగా నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి, ప్రస్తుతం తన సినిమాల వేగాన్ని తగ్గించింది. మరి ఇప్పుడు చేయబోతున్న ఈ ఆంథాలజీ సినిమాతో మంచు లక్ష్మి తనలోని వైవిధ్యాన్ని చూపించి భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.