Sridevi Drama Company: బుల్లి తెరలో ఎన్ని షోలు ఉన్నా.. ప్రేక్షకులు వినోదమైన కార్యక్రమాలకే మొగ్గు చూపుతారు. అలా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేసుకుని బోలెడు ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టే టీవీ చానల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్ షో లతో కాలం వెలిబుచ్చుతున్నాయి . అంతే కాకుండా బుల్లితెరకి ఎంటర్టైన్మెంట్ షోల తోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.

ఈటీవీ షోలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా మారింది. ఇందులో బుల్లితెర పై ఒక వెలుగొందుతున్న స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ నటి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి వారం వారం బుల్లితెర,వెండి తెర సెలెబ్రిటీలను పిలిచి సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ పరంగా కూడా ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కటి అని తేడా లేకుండా నవరసాలకి సంబందించిన పెర్ఫార్మన్స్ లన్ని దీనిలో ఉంటాయి. డాన్స్, కామెడీ, సింగింగ్ అలా పలు రకాలైన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లు కూడా ఉంటాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో యమలోకం సంబంధించిన డైరెక్టర్, హీరో ఈ కార్యక్రమానికి వచ్చారు. యమలీల రిలీజ్ అయ్యి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి, కామెడీ కింగ్ అలీ షో కి విచ్చేసారు.
యమలోకానికి సంబంధించిన సన్నివేశాలను సుడిగాలి సుధీర్ ప్రదర్శించగా, గెటప్ శ్రీను యమలోకానికి సంబంధించిన స్కిట్ ని ప్రదర్శించినట్లు ప్రోమోలో చూపించారు. అంతేకాకుండా ఇంద్రజ, అలీ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ లతో వచ్చే ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులని అలరించడానికి సన్నద్దమయ్యినట్లు తెలుస్తుంది. అలా యమలోకం 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే సెలబ్రేషన్స్ ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.