Manchu Lakshmi angry: సెలబ్రిటీలను చిక్కుల్లో పెట్టే ప్రశ్నలు అడగడం లో జర్నలిస్ట్ మూర్తి(Journalist Murthy) దిట్ట. ఇతన్ని తిట్టని సెలబ్రిటీ అంటూ ఎవ్వరూ మిగలలేదు. చివరికి ఎంతో సున్నితంగా సమాదానాలు చెప్పే డైరెక్టర్ క్రిష్ లాంటోళ్లకు కూడా ఈయన చిరాకు రప్పించిన సందర్భాలు ఉన్నాయి. అర్థరహిత ప్రశ్నలు అడగడు కానీ, సినిమా ప్రొమోషన్స్ కోసం వచ్చిన సెలబ్రిటీలను, తమ సినిమాకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా బయట విషయాలను అడుగుతూ ఉంటాడు. అవి కాంట్రవర్సి కి దారి తీస్తుంటాయి. రీసెంట్ గా ఈయన మంచు లక్ష్మి(Lakshmi Manchu) ని ఇంటర్వ్యూ చేసాడు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘దక్ష’ ఈ వారం లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఆ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో జర్నలిస్ట్ మూర్తి అడిగిన ఒక ప్రశ్నకు మంచు లక్ష్మి చాలా చిరాకు పడింది. ఇంతకూ ఆ ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దాం.
ముందుగా మూర్తి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు 50 ఏళ్ళ వయస్సుకి దగ్గరగా వస్తున్నారు. మీకు 12 ఏళ్ళ కూతురు ఉంది. అయినప్పటికీ ఇలాంటి డ్రెస్ లు వేస్తున్నారు అని జనాలు కామెంట్స్ చేసే అవకాశం ఉంది కదా’ అని అడుగుతాడు. దానికి మంచు లక్ష్మి సమాధానం చెప్తూ ‘ఇదే ప్రశ్న ని మీరు ఒక మగాడిని అడగగలరా..?, ఎంత ధైర్యం నీకు?, ఎంత ధైర్యముంటే ఇలాంటి ప్రశ్న నన్ను అడుగుతావు. అంటే మిమ్మల్ని కోపంగా అనడం లేదు, మీరు అడిగే ప్రశ్నకు అదే సరైన సమాధానం. మహేష్ బాబు నీకు 50 ఏళ్ళు వచ్చాయి, నువ్వు చొక్కా విప్పేసి సిక్స్ ప్యాక్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారా ఎవరైనా?, మరి ఒక ఆడపిల్లని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారండీ మీరు?, మీరు అడిగే ప్రశ్నలను చూసే జనాలు నేర్చుకుంటున్నారు. ఒక జర్నలిస్టుగా బాధ్యతగా ఉండడం నేర్చుకోండి. మీ స్థానం లో ఉన్నవాళ్లు ఎవరైనా, లక్ష్మీ నీకు నచ్చిన జీవితాన్ని అనుభవించు అని చెప్పాలి. కానీ మీరేమి చేస్తున్నారు, బోర్డర్స్ వేస్తున్నారు’ అంటూ చాలా బలంగా చెప్పుకొచ్చింది.
జర్నలిస్ట్ మూర్తి సోషల్ మీడియా లో బాగా పాపులర్ అవ్వడం తో పాటు, ఆయన పై మొదటి నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉండడం తో ఈ వీడియో ని అప్లోడ్ చేసి తెగ తిప్పుతున్నారు నెటిజెన్స్. మూర్తి కి సరైన సమాధానం భలే చెప్పావు అంటూ అందరూ మంచు లక్ష్మి ని ట్యాగ్ చేసి మెచ్చుకుంటున్నారు. కానీ ఎన్ని సార్లు ఎంత మంది సెలబ్రిటీలు తనని తిట్టినా కూడా తన జర్నలిజం స్టైల్ ని మార్చుకోకుండా, తనకు నచ్చిన విధంగా వెళ్తున్నాడంటే సాధారణమైన విషయం కాదు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయినా ఈ ఇంటర్వ్యూ ని మీరు కూడా చూసేయండి.