https://oktelugu.com/

టీజర్ టాక్: నవ్వేందుకు ‘మంచిరోజులొచ్చాయ్’

వర్షం మూవీ తీసిన దర్శకుడు ‘శోభన్’ ఆ తర్వాత ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ ఆయన కుమారుడు సంతోష్ శోభన్ మాత్రం సరికొత్త కథలతో హీరోగా నిరూపించుకుంటున్నాడు. తాజాగా మరో హెల్దీ కామెడీ చిత్రంతో మనముందుకొచ్చాడు. ‘మంచిరోజులొచ్చాయ్’ అంటూ సంతోష్ శోభన్ హీరోగా.. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ ను తాజాగా ఈరోజు ఆవిష్కరించారు. దర్శకుడు మారుతి మార్క్ కామెడీని ఈ చిత్రంలో చూపించారు. చాలా ఉల్లాసంగా సాగిపోతున్న సరదా ప్రయాణంలా ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2021 / 07:58 PM IST
    Follow us on

    వర్షం మూవీ తీసిన దర్శకుడు ‘శోభన్’ ఆ తర్వాత ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ ఆయన కుమారుడు సంతోష్ శోభన్ మాత్రం సరికొత్త కథలతో హీరోగా నిరూపించుకుంటున్నాడు. తాజాగా మరో హెల్దీ కామెడీ చిత్రంతో మనముందుకొచ్చాడు.
    ‘మంచిరోజులొచ్చాయ్’ అంటూ సంతోష్ శోభన్ హీరోగా.. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ ను తాజాగా ఈరోజు ఆవిష్కరించారు.

    దర్శకుడు మారుతి మార్క్ కామెడీని ఈ చిత్రంలో చూపించారు. చాలా ఉల్లాసంగా సాగిపోతున్న సరదా ప్రయాణంలా ఈ టీజర్ ఉంది.

    తాజాగా కట్ చేసిన టీజర్ చూస్తుంటే కరోనా కల్లోలంలో భయపడుతున్న జనాలు అనుభవించిన బాధలను కామెడీగా చూపించారని అర్థమవుతోంది. ఈ చిత్రంలోని దాదాపు అన్ని ముఖ్యమైన పాత్రలను ఇందులో చూపించడం విశేషం.భారీగానే కమెడియన్లను ఈ సినిమాలో వాడేశారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. అందరి క్యారెక్టరైజేషన్ విచిత్రంగా.. వినోదాత్మకంగా కనిపిస్తోంది.

    సంతోష్, మెహ్రీన్ కలిసి ప్రేమ జంటగా రోమాన్స్ పండించారు. ఎంతో అందమైన ప్రేమకథను ఇందులో అద్భుతంగా చూపించారు. ఇతర పాత్రలు కూడా అంతే ఆసక్తికరంగా మలిచారు.

    ‘మంచిరోజులొచ్చాయ్’ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని ఎస్.కే.ఎన్, వి సెల్యూలాయిడ్ సంస్థలు కలిసి నిర్మించారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.