https://oktelugu.com/

Shirisha : భర్తను భరించలేను.. విడాకుల ప్రకటన చేసిన మనసు మమత సీరియల్ నటి శిరీష!

దయచేసి మాపై విమర్శలు చేయకండి. అది మాత్రమే మేము కోరుకుంటున్నాము. నవీన్ పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఒక సెలబ్రెటీగా ఉన్నాను కనుకే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. మీ సపోర్ట్ కి చాలా థాంక్స్'' అంటూ శిరీష

Written By: , Updated On : May 16, 2024 / 06:04 PM IST
Manasu Mamata's serial actress Shirisha

Manasu Mamata's serial actress Shirisha

Follow us on

Shirisha : సీరియల్ నటి శిరీష తన భర్తతో విడిపోయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. విడాకుల సమాచారం పంచుకుంటూ… ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మొగలిరేకులు సీరియల్ లో సింధు పాత్రలో నటించిన శిరీష మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సీరియల్ తోనే ఆమెకు క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించింది.

స్వాతి చినుకులు, మనసు మమత, రాములమ్మ, నాతి చరామి, కాంచన గంగ, చెల్లెలి కాపురం వంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష .. నవీన్ వల్లభనేనిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు. గతంలో పలు టీవీ షోలు, ఈవెంట్స్ లో భర్తతో కలిసి సందడి చేసింది శిరీష. స్టార్ మా ఛానల్ లో ఓంకార్ నిర్వహించిన ఇస్మార్ట్ జోడి లో శిరీష – నవీన్ పార్టిసిపేట్ చేయడం విశేషం.

ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా కనిపించే ఈ జంట సడన్ గా విడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా శిరీష .. ‘ శ్రేయోభిలాషులు, అభిమానులతో నా పర్సనల్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త నవీన్ తో నేను విడాకులు తీసుకున్నాను. భరించలేని, కంట్రోల్ చేయలేని పరిస్థుతుల కారణంగా మేము వేర్వేరు దారులు ఎంచుకున్నాం. ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం.

దయచేసి మాపై విమర్శలు చేయకండి. అది మాత్రమే మేము కోరుకుంటున్నాము. నవీన్ పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఒక సెలబ్రెటీగా ఉన్నాను కనుకే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. మీ సపోర్ట్ కి చాలా థాంక్స్” అంటూ శిరీష ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక సొసైటీలో విడాకుల కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.