ఆంధ్రా ఓటింగ్ సరళి ఎలా ఉందో పరిశీలిద్దామంటే ఒకరోజు ఈసీ ఆలస్యంగా రిలీజ్ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరగడంతో పోలింగ్ పర్సంటేజీ లెక్కలు లేట్ అయ్యాయి.
ఆంధ్రా లోక్ సభ ఓటర్ల సరళి ఎలా ఉందంటే?
తెలంగాణలో 3.5 శాతం అధికంగా పోలైతే.. ఏపీలో 1.5 శాతం ఎక్కువగా పోలైంది. దేశంలో ఇవాళ వరకూ ఎక్కడా పోలింగ్ పర్సంటేజీ పెరగలేదు. అన్ని రాష్ట్రాల్లో తగ్గగా.. ఒక్క ఏపీలోనే అనూహ్యంగా గతం కంటే పోలింగ్ పర్సంటేజీ పెరగడం విశేషం. అందుకు తెలుగు రాష్ట్రాలను అభినందించాలి. ఎందుకు ఇంత జరుగుతుందని ఆలోచిస్తే.. పోటీ తీవ్రంగా ఉండొచ్చు.. ప్రజలు మార్పు కోసం ఓటేయవచ్చు.. లేదంటే అధికార పార్టీకి మద్దతుగా ఓటు వేయవచ్చని అంటున్నారు.
నియోజకవర్గాల వారిగా ఆంధ్రా ఓటింగ్ సరళి ఎలా ఉంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.